24 kisses movie online piracyసినిమాలో మ్యాటర్ లేనప్పుడు ఆన్‌లైన్ లోనే కాదు ఫ్రీషో వేసి చూపించినా ఎవరూ చూడరు. అయితే ఇదేదో కొత్త వార్త లాగా సినిమా ఆన్‌లైన్ లో వచ్చేసింది అంటూ ప్రచారం ఒకటి. ఇందంటా చూస్తూ ఉంటే సింపతీ యాంగిల్ ఏమైనా వర్కౌట్ చేద్దాం అని అనుకుంటుందా ఏంటి సినిమా యూనిట్ అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి కానీ. చిన్న సినిమాని చిదిమేసే మరో దుర్మార్గపు ఆలోచనే ఇది.

విజయ్ దేవరకొండ తన సినిమా విషయం జరిగిన పైరసీ గురించి మాట్లాడుతూ తన సినిమాని పైరసీ చేసి ప్రమోట్ చేసిన కొన్ని వెబ్‌సైట్స్ కి ఏకరువు పెట్టేశాడు. అయితే అంతమంది మధ్య భూతులు తప్ప అన్నీ రకాలుగా ‘చీ-సన్నాసుల్లారా’ అన్నట్లుగా గడ్డి పెట్టినా, ఎందుకిలా చేస్తున్నారు, సినిమా వెనుక ఎంత మంది కష్టం ఉంటుందో తెలిపినా…సిగ్గు రాలేదు సదరు పైరసీ వెబ్‌సైట్స్ ని నడిపే వారికి. ఇక తమ రోజువారీ పనిలో భాగంగా నిన్ననే విడుదలయిన హెబ్బా పటేల్ “24 కిసెస్” సినిమాని పైరసీ చేసి అప్పుడే వెబ్‌సైట్స్ లో పెట్టేశారు. సినిమా రిలీజ్ అయ్యీ 24 గంటలు గడవక ముందే ఈ సినిమా ఆన్‌లైన్ లో ‘తమిళ్ రాకర్స్’ వెబ్‌సైట్ లో దర్శనం ఇచ్చేసింది. అయితే అసలే డిజాస్టర్ టాక్ నడుస్తున్న సినిమా, అసలే ఓపెనింగ్స్ పెద్దగా లేని సినిమా, ఇంకా చెప్పాలి అంటే నిర్మాత దగ్గర నుంచి కొనుక్కున డిస్ట్రబ్యూటర్ వరకూ నిండా మునగక తప్పని సినిమాని పైరసీ చేసేసి నెట్ లో పెట్టేశారు.

ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే ఒక రకంగా పైరసీ చెయ్యడం తప్పే కానీ, మరో రకంగా చూస్తే డిజాస్టర్ టాక్ వచ్చిన ఈ సినిమాలో అక్కడక్కడ ఉన్న అడల్ట్ కంటెంట్ కోసం అయినా కుర్ర కారు ఆన్‌లైన్ లో ఈ సినిమాని ఒక లుక్ వేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా దేవరకొండ చెప్పినట్లు ఒక ఉద్యమంలా మారి ఈ పైరసీని ప్రేక్షకులే అరికట్టాలి తప్ప, హీరోలు, సినిమా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పైరసీ పిచ్చకి శుభం కార్డ్ పడదు. మరి ఇప్పటికీ ఈ సినిమా యాజమాన్యం ఆ పైరసీ వ్యవహారంపై తమ పని తాము చేసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది. అంతకన్నా ఏం చెయ్యగలరు..పైరసీ అనేది ఒక క్యాన్సర్ లాగా మారిపోయింది. చూస్తూ ఊరుకోలేము, అలా అని తగిన చర్యలు తీసుకున్నా, అప్పటికే జరగవలసిన ప్రమాధం జరిగిపోతుంది.