24 HOURS ENTERTAINMENT IN HYDERABADహైదరాబాద్ ను ‘విశ్వనగరం’గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా పలు సందర్భాలలో వ్యక్తపరిచారు. ‘విశ్వనగరం’ మాట ఎలా ఉన్నా, ‘ఎంటర్టైన్మెంట్’ హబ్ గా మాత్రం తీర్చిదిద్దే ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. దక్షిణాదిలో అతి పెద్ద మహానగరంగా ఉన్న బెంగళూర్ ను త్వరలోనే అధిగమించే విధంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

అర్థరాత్రులు కూడా జనసంచారం ఉండే నగరంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ లో ఇక నుండి రాత్రి వేళల్లో కూడా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా ధియేటర్లు తెరిచి ఉండేలా మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ లో ఎక్కువ శాతం ప్రైవేట్ సంస్థలు 24×7 పని చేస్తుండడంతో షిఫ్ట్ ల పధ్ధతిలో ఉద్యోగస్థులు నిత్యం ప్రయాణిస్తుంటారు. దీంతో ప్రజా అవసరాల నిమిత్తం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్ లో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందట.

ఇందు నిమిత్తం కార్మికులు, ట్రేడ్ యూనియన్లతో త్రైపాక్షిక చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలమై కార్యరూపం సిద్ధిస్తే, ఇక నుండి హైదరాబాద్ లో 24×7 ‘జాతరే జాతర’ అని చెప్పడంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ హబ్ గా ఉన్న హైదరాబాద్ ఇక నుండి దక్షిణాదికే ‘హెడ్’ కావచ్చు.