2024 will be difficult for Jagan if he doesn't wake up yet!ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు చాలా మంది. ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడంతో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది.

కనీసం రోడ్ల మీద తిరగలేని పరిస్థితి. సంక్షేమ ఫలాలు దక్కని మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వర్గాలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అలాగని సంక్షేమపథకాల లబ్ధిదారులు పూర్తిగా హ్యాపీగా ఉన్నారా అంటే అలా చెప్పడం కష్టం.

అందులో డబ్బులు తీసుకుని కూడా వేరే పార్టీల వారికి వేసే వారు ఉంటారు. ఆ వర్గాలు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి రోడ్లు అక్కర్లేదు… పనులు లేకపోయినా పర్వాలేదు అనుకుంటాయి అనుకుంటే పొరపాటే. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కావాలి.

ఆ లెక్క ప్రకారం జగన్ పాలన మీద ఏ వర్గాలూ కూడా హ్యాపీగా లేవు. అయితే ఇంకా రెండున్నరేళ్లు ఉన్నాయి కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు అనుకోవచ్చు. చంద్రబాబు పాలనలో రెండున్నరేళ్ళ కు అసలు ప్రభుత్వ వ్యతిరేకత అనేది లేదు. సహజంగా ఏ ప్రభుత్వం మీదైనా చివరి ఏడాది, ఏడాదిన్నర సమయంలో వ్యతిరేకత ఎంతో కొంత పెరుగుతుంది.

ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతకు చివర్లో ఇంకా పెరిగితే జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.. మేలుకోక పోతే ఇబ్బందే.