Andhra-Pradesh-2019-Elections---Which-Way-Are-The-Winds-Blowingఅన్ని వర్గాల వారికి పూర్తి వినోదం అందించేందుకు 2019వ సంవత్సరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అవును… ఇటు సినీ ఇండస్ట్రీకి, అటు పొలిటికల్ వర్గాలకు, మరోవైపు క్రికెటే ప్రపంచంగా బ్రతికే క్రీడాభిమానులకు వచ్చే ఏడాది ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది సంక్రాంతితో మొదలయ్యే సినీ వినోదం ఓ పక్క అయితే, ఎలక్షన్ల ప్రచార జోరు మరోపక్కన జనాలకు ఎంటర్టైన్మెంట్ ను పంచనుంది.

మెగా ఫ్యాన్స్ కోసం చిరంజీవి “సైరా” సిద్ధమవుతుండగా, నందమూరి ఫ్యాన్స్ కోసం “ఎన్టీఆర్” బయోపిక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సిద్ధమవుతున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు 25వ సినిమా విడుదల సమ్మర్ లో ఉండనుండగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సాహో” కూడా అదే టైంలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇవి కాకుండా రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల మల్టీస్టారర్ కూడా 2019లోనే విడుదల కానుంది.

సినిమాల పరంగా కంటెంట్ ఇలా ఉంటే, పొలిటికల్ గా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల వేడి మామూలుగా ఉండదు. అందులోనూ ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ బరిలోకి దిగుతుండడంతో, పవర్ స్టార్ సత్తా ఎంతన్నది ఏపీ, తెలంగాణా ప్రజలకు తెలియనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో మోడీకి ఎదురు నిలబడి అధికారంలోకి వచ్చేదేవరన్న దానిపై కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి నెలకొంది.

క్రీడారంగంలో కూడా 2019 ప్రతిష్టాత్మకం కానుంది. రెగ్యులర్ గా ఉండే ఐపీఎల్ కు తోడు ప్రపంచ కప్ జరుగుతుండడం ఈ ఏడాదిని మరింత స్పెషాలిటీ మార్చేసింది. ఇలా ఏ రంగం చూసుకున్నా వచ్చే ఏడాదిలో ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ అన్న రీతిలో ఉంది. అయితే ఈ అన్ని విభాగాల్లోనూ ఆసక్తి ఉన్న వారికైతే వచ్చే సంవత్సరం పండగ లాంటిదేనని పేర్కొనవచ్చు. అన్నింటిలోనూ అత్యంత ఆసక్తిని కనపరిచేది మీడియానే కదా…!