2000 rupees Note to Banపెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత ప్రవేశపెట్టిన కొత్త 2000 రూపాయల నోటును కూడా రద్దు చేయాలంటూ, తొలుత మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత లభించేలా ఆ తర్వాత దేశంలోని చాలా మంది ప్రముఖులు 2000 రూపాయల నోటుకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీనికి తోడు ఇది కేవలం తాత్కాలికంగానే ప్రవేశపెట్టిన నోటు అని, తర్వలో ఏ క్షణంలోనైనా ఈ పెద్ద నోటును కూడా రద్దు చేస్తారని అనధికారికంగా హల్చల్ చేసిన సమాచారం తెలిసిందే.

కానీ, ఇవి ఒట్టి పుకార్లు కాదు, అతి త్వరలోనే ఈ నోటును కూడా రద్దు చేసే అవకాశాలున్నాయని అఖిల భారత స్టేట్ బ్యాంకు అధికారుల సంఘం అధ్యక్షుడు థామస్ ఫ్రాంకో తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ లోపునే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడవచ్చని కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో త్వరలోనే కొత్త 2000 రూపాయల నోటు కూడా కనుమరుగు కానుందని చెప్పవచ్చు. 500, 1000 నోట్ల రద్దు సందర్భంలో పెద్దగా నల్లధనం బయటకు రాకపోవడంతో… 2 వేల నోటుతో అయినా కొంత బయట పడుతుందేమో చూడాలి.