2.0-Movie-Promotions---Lyca-Productionsనవంబర్ 3వ తేదీన శంకర్ – సూపర్ స్టార్ రజనీకాంత్ ల “2.0” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. అలాగే సినిమాను నవంబర్ 29వ తేదీన విడుదల చేయనుండగా, ఈ పబ్లిసిటీని పురస్కరించుకుని, అభిమానులు రూపకల్పన చేసిన పలు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ది వరల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్’ అంటూ కాప్షన్ ఈ సినిమా పోస్టర్లు వీక్షకులను ఆకర్షిస్తున్నాయి.

ఎన్నో వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు రికార్డులు సృష్టించే ఓపెనింగ్స్ దక్కాలంటే, ఈ శనివారం నాడు విడుదల కాబోయే ధియేటిరికల్ ట్రైలర్ చాలా కీలకమనే చెప్పాలి. ట్రేడ్ టాక్ ప్రకారం ‘2.0’ విజువల్ వండర్ ఖాయమని చెప్తున్నప్పటికీ, అవి ఏ స్థాయిలో ఉంటాయనేది వేచిచూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అమీ జాక్సన్ కన్నులవిందు చేయనుంది.