2.0 movie producers are mobile network providersనిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి భారీ హిట్ అందుకుని మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది రజనీకాంత్ రోబో 2.0. అయితే రజని గత రెండు సినిమాలు కాస్త నిరాశ పరిచినా..అనుకున్న సమయం కన్నా కాస్త లేట్ గా వచ్చినా..డీసెంట్ హిట్ ఇచ్చాడు రజని. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కొత్త వార్త ఒకటి సోషియల్ మీడియాలో కాస్త వైరల్ అవుతూ ఉంది.

ఒక నెటిజన్ చేసిన కామెంట్స్ ఆధారంగా మొదలయ్యింది ఈ వార్త. ఆయన చెప్పిన దాని ప్రకారం లైకా సినిమాలో సెల్ ఫోన్స్, రేడీయేషన్ అన్న కోణంలో కధ నడుస్తున్న సంగతి మనకు తెలుసు, దాని వల్ల భవిష్యత్తులో జరగయే పరిణామాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అయితే ఇక్కడ “లైకా” సంస్థ కూడా ఒక సెల్ ఫోన్ కంపనీ అని, మరి సెల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ అయిన లైకా. ఆ సెల్ ఫోన్ రేడీయేషన్, పక్షులు చచ్చిపోతున్నాయి, మనుషులు ఇబ్బందులు పడతారు అని సినిమా తియ్యడం ఏదైతే ఉందో అదీ మరీ విడ్డూరం అన్నట్లుగా సదరు నెటిజన్ కామెంట్స్ చేశారు. ఇది ఎలా ఉంది అంటే, ఇదే నిజం అయితే “నా పేరు ముకేశ్” యాడ్ ని సిగరెట్ కంపెనీ వాడు స్పొన్సర్ చేసినట్లుగా ఉంది అని ఇంకో నెటిజన్ కామెంట్స్ చేశాడు. నిజమే కదా తప్పు కదా సెల్ ఫోన్ కంపనీనే ఇలా సినిమా తియ్యడం ఏంటి అనుకుంటే…

ఇదే మరీ సిల్లీ లాజిక్ అవుతుంది. సెల్ ఫోన్ ప్రవైడర్ అయినంత మాత్రాన సెల్ ఫోన్ రేడీయేషన్ గురించి సినిమా తియ్యకూడదా? ఇది ఎలా ఉంది అంటే మందు అమ్మే వాడు మందు హానికరం అని చెప్పకూడదు. సిగరెట్ అమ్మే వాళ్ళు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని చెప్పకూడదు అన్నట్లుగా ఉంది. పైగా ఒక వేళ నిజంగా లైకా ‘సర్విస్ ప్రవైడర్’ వ్యాపారం నుంచి తప్పుకుంటే మనం సెల్ వాడటం మానేస్తామా? మన అవసరాల కోసం మనం సెల్ ఫోన్స్ వాడుతున్నాం. అయితే అలానే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూనే ఇదిగో ఇలా భవిష్యత్తులో జరిగే పరిమాణాలను మనకు అందించారు. సినిమాలో సీరీయస్‌నెస్ ను గుర్తించాలి..అంతేకాని ఇలా సిల్లీగా లాజిక్స్ వెతకడం “Just for Time pass” అవుతుంది.