2.0-leaked-teaser‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టే సినిమాగా ట్రేడ్ వర్గాలలో అత్యంత ఆసక్తిని కలిగిస్తోన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘2.0 రోబో’ టీజర్ అధికారికంగా రిలీజ్ కావడాని కంటే ముందు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే ఈ లీకేజ్ చిత్ర యూనిట్ సభ్యుల నుండో, గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్న దగ్గర నుండో లీక్ కాలేదు. ఓ బహిరంగ వేదికపై ప్రదర్శితమైన టీజర్ ను మొబైల్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో కొందరు రిలీజ్ చేసారు.

మరి సూపర్ స్టార్ టీజర్ లీక్ అయితే అది సెన్సేషన్ కాకుండా ఉంటుందా! అదే జరిగింది. కొద్ది సమయంలోనే అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లీక్ సరే… ఇంతకీ టీజర్ ఎలా ఉంది? ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొడుతుందన్న నమ్మకాన్ని ఇచ్చిందా? గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? చిట్టి ‘రోబో’గా రజనీ ఎలా ఉన్నాడు? ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే విధంగా ఉందా? అన్న సందేహాలు తలెత్తడం సహజమే.

అయితే నాణ్యత లేని ఇలాంటి లీక్ లను ప్రోత్సహించడం సరైనది కాదు గనుక, సదరు సంగతులన్నీ అధికారికంగా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడం ఉత్తమం. అయితే లీక్ ద్వారా స్పష్టమైన విషయం ఏమిటంటే… సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్ కు మాత్రం కొరత లేదని! అయితే ఆ విజువల్స్ అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఉంటాయా? లేక ‘రోబో’ ఫస్ట్ పార్ట్ మాదిరి పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉంటాయా? అన్నది ప్రశ్నార్ధకం!