2-0-movie-collections-in-south-indiaదాదాపుగా గత వారం పది రోజుల నుంచి ఎక్కడ చూసినా రజని కాంత్ రోబో 2.0 గురించే గుసగుసలు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఈ సినిమా ఏ సినిమా రికార్డ్స్ కి చెక్ పెడుతుంది అని. ఇదిలా ఉంటే రజని గత రెండు సినిమాలు కాస్త రజని రేంజ్ లో లేకపోవడం, వస్తాను అన్న టైమ్ కాస్త లేట్ గా ఈ సినిమా రావడం అన్ని వెరసి ఈ సినిమాపై బజ్ కాస్త తగ్గించి అని చెప్పడంలో నిజం లేకపోలేదు. అయితే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ సినిమా వీలైనన్ని కలెక్షన్స్ ని కొల్లగొట్టిందీ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చూసుకుంటే రజని హవా గట్టిగా ఉంటుంది…అందులోనూ మన తమిళ నాట మరీనూ.

అయితే ఇక్కడ చిన్న కిక్ ఇచ్చే అంశం ఏంటి అంటే ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో మన ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, ముఖ్యంగా తమిళ నాడును మించి. కానీ సాయంత్రానికి కలెక్షన్స్ విషయంలో మాత్రం తమిళ నాడు దూసుకుపోయి, మరోమారు తమ అభిమాన హీరో రజనిపై తమ భక్తిని చాటుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు షేర్ వచ్చి 12.43 కోట్లు కాగా, అందులో నైజామ్ ఏరియాలో మాత్రమే ఏకంగా 4.75కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక తమిళ నాట చూసుకుంటే తెలుగులో కన్నా తక్కువ థియేటర్స్లో సినిమా విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ ని నిన్నంతా నిద్ర లేకుండా చేశాడు రజని.

కాలీవుడ్ లో ఉన్న రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేసేసి దాదాపుగా 35 కోట్ల వసూళ్లను తొలి రోజే సాధించింది ఈ సినిమా. అయితే ఈ వసూళ్ల లెక్కల్లో ఒక్క చెన్నై నగరంలోనే 2.64 కోట్లు రావడం విశేషంగా చెప్పవచ్చు. మరో పక్క ఇక్కడ తాజాగా సర్కార్ తో విజయ్ నమోదు చేసిన రికార్డులు అన్నీ బ్రేక్ అయిపోయాయి అన్నది లోకల్ టాక్. ఇక కేరళ రాష్ట్రంలో కూడా తొలి రోజు 4.15 కోట్ల వసూళ్లు సాధించి లోకల్ టాప్5 ‘డే1’ కలెక్షన్స్ లో నిలిచింది. మొత్తంగా చూసుకుంటే దక్షిణ భారతంలో రజని మార్క్ మరోమారు కాస్త బలంగానే పడింది అని చెప్పవచ్చు.