Demolition Notice Served to Chandrababu Naidu's House in Undavalliఒకప్పటి మిత్రుడు ప్రస్తుత రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును జైలుకు పంపడానికి బీజేపీ ఆరాటపడుతుంది. ఆంధ్రప్రదేశ్ కో-ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలు ఇదే సూచిస్తున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో 18మంది తమతో టచ్‌లో ఉన్నారని దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ కారణంగానే టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల, అవినీతి వల్ల ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేకుండా పోయిందని దియోధర్ చెప్పుకొచ్చారు. సునీల్ దియోధర్ ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం ఇదే మొదటి సారి కాకపోవడం విశేషం.

మరి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సిఎం రమేష్ లు ఆ జాబితాలో లేరేమో? అందుకే బీజేపీ వారిని చేర్చుకుని ఉండొచ్చు. లేక వారు బీజేపీలో చేరగానే పునీతులు అయిపోయారు. అది అలా ఉండగా ఏపీలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో లక్ష మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు సునీల్ దియోధర్ తెలిపారు. అంటే కనీసం 25 లక్షల సభ్యులు… ఇక విషయానికి వస్తే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన ఓట్లు కేవలం 0.84%… అంటే కనీసం ఆ 25 లక్షల ఓట్లలో నాలుగో వంతు కూడా కాదు.