14 reels next with ram and santosh srinivas‘ఆగడు’ సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఈ ఏడాది ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మరో సినిమాకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతోంది. చాలా కాలం తర్వాత ‘నేను… శైలజ…’ చిత్రంతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద హిట్టు అందుకున్న హీరో రామ్ తో 14 రీల్స్ సంస్థ ఓ సినిమాకు శ్రీకారం చుట్టబోతోంది.

‘కందిరీగ’ సినిమాతో సూపర్ హిట్ అయిన రామ్ – సంతోష్ శ్రీనివాస్ ల సక్సెస్ ఫుల్ కాంభినేషన్ ను 14 రీల్స్ సంస్థ మరోసారి పునరావృతం చేయబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. దర్శకనిర్మాతలు చిత్ర తారాగణం ఎంపికలో నిమగ్నమయ్యారు. మొత్తం పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ నుండే అధికారికంగా వెలువడనుంది.