118 Teaser - Nandamuri Kalyan Ram, Nivetha Thomas, Shalini Pandeyనందమూరి వారసత్వం నుంచి పుట్టుకొచ్చిన యువ హీరోల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కల్యాణ్ రామ్. అయితే భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న కల్యాణ్ రామ్ కి అది మాత్రం ఇప్పటివరకూ దక్కలేదు అనే చెప్పాలి.

తాజాగా పాటాస్ తర్వాత వరుస ఫ్లాప్స్ తో సరైన హిట్ లేని కల్యాణ్ రామ్…”118″ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మరో సారి కొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఆ కోవలోనే ఈ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. టైటిల్ మంచి ఇంట్రెస్టింగ్ గా…క్యాచీగా ఉన్నప్పటికే ట్రైలర్ మాత్రం రొటీన్ గానే ఉంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

టీజర్ ను కాస్త క్లుప్తంగా పరిశీలిస్తే..లవ్ స్టోరీ…మధ్యలో హీరోయిన్ పై అట్యాక్ జరగడం..బహుశా 118 అనేది టైమ్ ని సూచిస్తున్నట్లుగా అనిపిస్తున్న షాట్…ఇక హీరోయిన్ ని అట్యాక్ చేసిన వారి వేటలో హీరో బయలుదేరడం…ఇలా షరా మామూలు కధగానే అనిపిస్తుంది.

ఇక టీజర్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త డిఫరెంట్ గా అనిపించింది. కల్యాణ్ రామ్ కూడా స్టైలిష్ గా ఉన్నాడు..కధ..దర్శకత్వం కేవీ గుహన్ చేస్తూ ఉండగా…కోనేరు మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక కల్యాణ్ రామ్ తో నివేదా థొమస్…శాలినీ పాండే రొమ్యాన్స్ చెయ్యనున్నారు.

మరి టైటిల్ లాగా సినిమా కొత్తగా ఉంటుందో…లేక టీజర్ లాగా రొటీన్ గా ఉసూరుమనిపిస్తుందో చూడాలి.