అల్లుడిగారిని బాధ పెట్టినందుకు 10 మంది అరెస్టు

Chiranjeevi Son in law Kalyaan Dhev Files Cyber Crime Complaintమెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తనకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత మంది పనిగట్టుకుని ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని, అసభ్యకర కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. తొలుత వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా ఆ తరువాత అవి ఎక్కువ కావడంతో ఈ కామెంట్లను భరించలేక ఆయన పోలీసులను ఆశ్రయించారు.

కళ్యాణ్ దేవ్ ఇచ్చిన కంప్లయింట్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసే ఫొటోల కింద ఓ 10 మంది వ్యక్తులు దారుణమైన కామెంట్లు చేస్తున్నారని.. తన కుటుంబసభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కళ్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. ఇటీవలే శ్రీజ మొదటి భర్తకు రెండో వివాహం జరగడంతో ఈ వెకిలి చేష్టలు ఎక్కువయ్యాట. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ 10 మందిని గుర్తించారు.

వారి వివరాలు, ఐపీ అడ్రస్‌లు కావాలని ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ద్వారా సేకరించారు. ఆ వివరాలు వారి నుండి సేకరించి అరెస్టు చేశారు. గత ఏడాదికళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తరువాత ఆయన ఇంకో సినిమా ప్రకటించినా ఇప్పటివరకూ అది తెరకెక్కలేదు. గత ఏడాది చివర్లో శ్రీజా – కళ్యాణ్ దేవ్ దంపతులకు ఒక కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే.

Follow @mirchi9 for more User Comments
TDP-Targeted-Saaho---Can-Not-Be-Bigger--Joke!Don't MissTDP Targeted Saaho - Can Not Be Bigger Joke!Young Rebel Star Prabhas in an interview promoting his Saaho was asked about the new...Ranarangam - Sharwanand - Kajal AggarwalDon't MissShock Is a Polite Word to Put ItSharwanand's 'Ranarangam' has certainly put up a sad show when it came to the box-office...First Sizzling Shoot of Shivatmika RajasekharDon't MissFirst Sizzling Shoot of Shivatmika RajasekharLook at the pics from the latest photoshoot of Sivatmika Rajasekhar. This is the first...Hyderabad to be Made A Union TerritoryDon't MissHyderabad to be Made A Union Territory?If a report published in Deccan Chronicle is to be believed, the Union Government is...Vijayashanthi Hasn't Done That BeforeDon't MissVijayashanthi Hasn't Done That BeforeAfter a long hiatus, when yesteryear actress Vijayashanti is doing Mahesh Babu's 'Sarileru Neekevvaru' and...
Mirchi9