100% Love - Experience Love on Star Maa this Sundayప్రేమంటే రెండు అక్షరాల మహాకావ్యం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది. అలాంటి ప్రేమని స్టార్ మా ఈ ఆదివారం ఓ కొత్త కోణంలో ఒక ఈవెంట్ గా అందించబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ పేరు “100% లవ్”. తెరపైన జంటలకీ నిజ జీవితంలో జంటలకీ మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు! సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలనే ఉంటూనే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించడానికి “100% లవ్” అన్ని హంగులతో రాబోతోంది.

సరదాగా ఆడుకునే ఆటలు, ప్రేమగా పంచుకునే మాటలు, రెండు హృదయాల మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, ఉంగరాలు మార్చుకునే ఉద్వేగ క్షణాలు, కలిసి అడుగులు వేసే సంతోషాలు… ఇలాంటివి ఎన్నో ఈ ఈవెంట్ అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 21న) సాయంత్రం 6 గంటలకు “100% లవ్” ఈవెంట్ స్టార్ మా లో ప్రసారమవుతుంది.

ఇక ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే మస్తీ గురించి చెప్పాల్సిందే. మధ్యాహ్నం 12 గంటలకు సీనియర్ యాంకర్ సుమ నవ్వించే తన సహజ ధోరణితో ” స్టార్ట్ మ్యూజిక్ “ని 100 % అద్భుతంగా తీర్చిదిద్దితే, ఆ వెంటనే 1. గంటలకు వర్షిణి తన “కామెడీ స్టార్స్” తో గ్యాప్ లేకుండా 100% నవ్వులు పంచబోతోంది. మ్యూజిక్ తో చేసే హంగామా, ఆ తరవాత కామెడీ గ్యాంగ్స్ తో నజరానా.. ఇవన్నీ కలిసిన ఈ ఆదివారాన్ని మిస్ కాకండి మీ స్టార్ మా లో.

“100% లవ్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/9hio_Epl40M

Press release by: Indian Clicks, LLC