YSRCP failed in Andhra Pradesh Developmentగత ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలు, సంప్రదింపులతో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వందల చిన్న, పెద్ద పరిశ్రమలు నెలకొల్పిన విషయం తెలిసిందే. మరి ఆ ఒరవడిని వైసీపీ సర్కార్ కొనసాగించించిందా? అంటే ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయే పరిస్థితికి తీసుకువచ్చిందన్న విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది.

కానీ ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్ మాత్రం వైసీపీ సర్కార్ వచ్చాకా చాలా పరిశ్రమలు వచ్చాయని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అయితే అది ఒక్క ప్రొడక్ట్ పైనే దృష్టి కేంద్రీకృతం చేసిందని, ఆ ఒక్క ప్రొడక్ట్ ద్వారానే ఇప్పటివరకు కొన్ని వందల కంపెనీలను ఏపీకి తీసుకువచ్చిందని స్వయంగా నారా లోకేష్ చెప్తున్నారు. అంతేకాదు ఆ కంపెనీల వివరాలు కూడా చెప్పుకొచ్చారు.

1) బూమ్ బూమ్
2)ప్రెసిడెంట్ మెడల్
3)స్పెషల్ స్టేటస్
4) 3 క్యాపిటల్స్

ఇంకా ఈ జాబితా చెప్పాలంటారా! దాదాపుగా ఇప్పటివరకు చాలా కంపెనీలను వైసీపీ సర్కార్ తీసుకువచ్చిందంటూ నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు. బహుశా తాము తీసుకొచ్చిన వందలాది కంపెనీల జాబితా వైసీపీకే అవగాహన లేదో ఏమో గానీ, లోకేష్ బాబు మాత్రం వైసీపీ తరపున ఈ కంపెనీలు వచ్చాయంటూ ప్రచారం చేస్తున్నారు.

ఉత్పత్తుల విషయంలో వికేంద్రీకరణను వైసీపీ నమ్ముకోలేదని ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయం. విశేషం ఏమిటంటే… వైసీపీ అయిదేళ్ల టర్మ్ పాలన పూర్తయ్యే నాటికి ఈ కంపెనీల జాబితా ఒక వెయ్యికి టచ్ అయినా ఆశ్చర్యం లేదన్నది నెటిజన్ల మాట.