YS Jagan warning to policeఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా ఉన్న హవాలా కేసుల లిస్ట్ ఒకటి తయారు చేసింది. మొత్తం 1000 సూట్ కేసు కంపెనీల ద్వారా జరిగిన హవాలా మీద ఈడీ దృష్టి పెట్టింది. అందులో టాప్ 10 కేసుల లిస్ట్ ను ప్రముఖ ఆంగ్ల దినపత్రిక, టైమ్స్ అఫ్ ఇండియా ప్రచురించింది.

దీనిలో ఇద్దరు రాజకీయనాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ లిస్టులో 7వ స్థానంలో ఉండగా, మాజీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఛగన్ భుజ్బల్ 10వ స్థానంలో ఉన్నారు. వైఎస్ జగన్ తనకు చెందిన 31 సూట్ కేస్ కంపెనీల ద్వారా 368 కోట్లు హవాలా ద్వారా మళ్లించినట్టు ఈడీ అభియోగం.

దీని ప్రకారం ఆయనకు చెందిన చాలా ఆస్తులు ఆల్రెడీ ఈడీ జప్తు చేసింది. టాప్ 10 కంపెనీల ద్వారా మొత్తంగా 3587 కోట్లు హవాలా జరిగినట్టు ఈడీ అభియోగం. వివిధ కేసులలో ఇప్పటికి ఈడీ 19 మందిని అరెస్ట్ చేసింది. జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా 17 నెలలు జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్నారు.

అయితే ఈడీ కేసులు కొంచెం సంక్లిష్టం కావడంతో ఈ కేసులలో విచారణ కాస్త నెమ్మదిగా ఉంది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ బయటకి రావడంతో నిత్యం విలువలు, విశ్వసనీయత అని వల్లెవేసే జగన్ ఏమని సమాధానం చెప్తారో చూడాలి మరి! 2019 ఎన్నికల ముందు వివిధ కేసులలో ఏదో ఒకటి తేలి శిక్ష పడితే అది జగన్ కు రాజకీయంగా చాల ఇబ్బంది అవుతుంది.