YSRCP MP differs with Party on TTD assets controversyనిరర్ధక ఆస్తుల పేరిట తమిళనాడు లో తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన 23 ఆస్తులు వేలం వెయ్యడానికి సిద్ధమైంది టీటీడీ. దీనికి సంబంధించిన జీఓ కూడా వచ్చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. స్వామి వారి ఆస్తులు చౌక ధరలకు అనుయాయులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఈ ప్లాన్ వేసిందని పలువురు ఆరోపణ.

ఈ విషయంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం. :దేవుడికి భక్తులు ఇచ్చిన భూములవి. కొన్ని సెంటిమెంట్లుతో అలా భూముల్ని దేవుడికి భక్తులకు ఇస్తూ ఉంటారు. డబ్బు వేరు.. భూమి వేరు.. ప్రభుత్వం ఈ విషయంలో హుందాతనంగా వ్యవహరించి వుండాల్సింది..’ అంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉండగా.. గతంలో సదవర్తి భూముల విషయంగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీ లో దేవుడు భూములు ప్రభుత్వం అమ్ముకోవాలని అనుకోవడం పాపం అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డి (ఇప్పటి టీటీడీ చైర్మన్) విమర్శించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.

మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిలో వెనక్కు తగ్గితే ప్రతిపక్షాల పంతం నెగ్గినట్టు అవుతుందని, అది ప్రభుత్వానికి అప్రదిష్ట అని ముఖ్యమంత్రి జగన్ అనుకుంటున్నారట. అయితే దేవుడి విషయంలో కొంత పట్టువిడుపు ప్రదర్శిస్తే ప్రభుత్వానికే మంచిది.