sanjana pawan kalyan sardaar gabbar singhపవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ‘పవర్‌’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాను సన్నిహితుడు శరత్‌ మారార్‌తో కలిసి పవన్‌ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. రాయ్‌ లక్ష్మీ ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ఐటెం సాంగ్‌ను చేసింది. ఈ ఇద్దరు హీరోయిన్స్‌ కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ సంజన కూడా నటించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ప్రభాస్‌కు ‘బుజ్జిగాడు’ చిత్రంలో మరదలుగా నటించిన సంజనను ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చాడు. ఒక ముఖ్య పాత్రలో ఈ అమ్మడు కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే నెలలో సంజన ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతుంది. పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించబోతుండటంతో ఈ అమ్మడు ఫుల్‌ హ్యాపీగా ఉంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో దర్శకుడు బాబీ మరియు నిర్మాత శరత్‌ మారార్‌ ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్‌ అయితే సంజనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్‌ ఉంది.