ravi teja bengal tigerమాస్‌ మహారాజ రవితేజ వచ్చే నెలలో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ‘రచ్చ’ ఫేం సంపత్‌ నంది ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌ మరియు పోస్టర్స్‌ సినిమాపై నమ్మకంను పెంచేశాయి. ఇక ఆ సినిమా విడుదల అయిన వెంటనే రవితేజ మరో సినిమా చేసేందుకు ఇప్పటికే కమిట్‌మెంట్‌ ఇచ్చేశాడు. ‘స్వామిరారా’తో సక్సెస్‌ కొట్టి ‘దోచేయ్‌’తో ఫ్లాప్‌ అయిన సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడు.

‘దోచేయ్‌’ ఫ్లాప్‌తో కాస్త గ్యాప్‌ తీసుకున్న సుధీర్‌ వర్మ ఈ గ్యాప్‌లో ఒక మంచి మాస్‌ మసాలా కథను సిద్దం చేశాడట. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఈ కథ ఉందని చెబుతున్నాడు. రవితేజ ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత రవితేజ డబుల్‌ రోల్‌ చేయబోతున్నాడు. దాంతో సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఆ అంచనాలను అందుకేనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాను అంటున్నాడు దర్శకుడు సుధీర్‌ వర్మ. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించే అవకాశాలున్నాయి.