యంగ్ టైగర్ హోస్ట్ చేస్తోన్న “మీలో ఎవరు కోటీశ్వరుడు” షోలో ఎప్పుడైతే ప్రిన్స్ మహేష్ బాబు పాల్గొన్నారని ఫోటో లీక్ అయ్యిందో, అప్పటి నుండి ఈ షో ఎప్పుడు ప్రదర్శితం అవుతుందోనని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతగానో నిరీక్షించారు.

తొలుత దీపావళి నాడు ఈ షో ప్రదర్శితం అవుతుందని భావించినప్పటికీ, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు క్లైమాక్స్ గా వీరిద్దరి కలయిక ఎపిసోడ్ ఉంటుందన్న సమాచారం అందింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి జెమినీ టీవీ ప్రమోషన్ ను ఆరంభించింది.

అతి త్వరలోనే ‘ఎపిసోడ్ ఆఫ్ ది డికేడ్’ ఉంటుందంటూ మహేష్ – ఎన్టీఆర్ కలయికలో ఉన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అభిమానులను ఊరిస్తోంది. దీంతో ఇప్పటికైనా మోక్షం కలిగించారంటూ ఈ పిక్చర్ ను షేర్ చేసుకుంటూ సందడి చేయడం ఈ ఇద్దరి అగ్ర హీరోల అభిమానుల వంతవుతోంది.