ఇటీవల కాలంలో సంచలనంగా నిలిచిన టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్, తాజాగా ఓ ప్రింట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ భావాలను పంచుకుంది. ఈ క్రమంలో తన సినీ అవకాశాలపై స్పందిస్తూ… ఓ రోజు ఓ బడా నిర్మాత తమ ఇంటి వద్దకు వచ్చి, ‘నువ్వు బాగా నటిస్తావ్, పెద్ద హీరోల సరసన ఆఫర్లు ఇప్పిస్తాను, నన్ను కలువు’ అని చెప్పగా, ఓ రోజు అమ్మతో కలిసి ఆయన దగ్గరికి వెళ్లాను.
అయితే తన కూడా అమ్మ ఉండడంతో ముభావంగా ప్రవర్తించిన సదరు నిర్మాత, ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. సక్సెస్ అయిన ప్రతి హీరోయిన్ కూడా లోలోపల ఎంతో ఇబ్బందులు పడుతుంటారని, హీరోలకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పెళ్లి చేసేసుకుని హాయిగా జీవితం సాగిస్తారని, అదే హీరోయిన్లైతే వారి జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.
ట్విట్టర్ లో చేసిన ఓ చిన్న పోస్ట్ కు ఎదురుదాడి రావడంతోనే, ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేసానని చెప్పిన పీకే, జీవితంలో ఇదొక గుణపాఠంగా భావించానని తెలిపింది. ఆ సమయంలో తనకు అండగా కుటుంబం తప్ప ఎవరూ నిలవలేదని, పాపులర్ అయ్యేందుకు తాను ఇలాంటి పనులు చేయనని పంచుకుంది. ఎనిమిదో తరగతిలో ఓ అబ్బాయి మోకాలుపై నిల్చుని తనకు ప్రపోజ్ చేసిందే తన లైఫ్ లో స్వీటెస్ట్ ప్రపోజల్ అని చెప్పుకొచ్చింది.