సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్‌లను పిలిపించుకొని మొట్టికాయలు వేసినా ఇంకా వారి మద్య రాజుకొన్న వేడి ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతోంది.
అనిల్ కుమార్ మంత్రి కుర్చీని ఖాళీ చేయగానే దానిలో కాకాణి సెటిల్ అవడంతో, నెల్లూరు పట్టణంలో ఎక్కడ చూసినా ఆయనవి, ఆయన అనుచరుల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. వీటిపై అనిల్ కుమార్ స్పందిస్తూ “నేను రెండున్నరేళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు పట్టణాన్ని ఫ్లెక్సీ రహితంగా ఉంచాను. కానీ ఇప్పుడు నా స్థానంలో కొత్తగా వచ్చినవారు పట్టణంలో ఫ్లెక్సీల సంస్కృతి మళ్ళీ మొదలుపెట్టారు. దానికి పార్టీలో ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. పార్టీలో ఎవరికీ పట్టనప్పుడు నేనొక్కడినే ఎందుకు బాధపడాలని నేను కూడా పట్టించుకోవడం మానేశాను. అయినా ప్రతిపక్షాలతో పోరాడవచ్చు కానీ సొంతపార్టీ వారితోనే పోరాడాలంటే ఎలా?” అని అన్నారు.
మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొంటునప్పటికీ, అలనాడు చక్రవర్తులు, రాజులు, సామంత రాజులు, వారి రాజ్యాలు ఉన్నట్లే ఇప్పుడు మంత్రులకు జిల్లాలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో వారే కింగులుగా చలామణి అవుతుంటారు. అందుకే ఆ జిల్లా లేదా నియోజకవర్గంపై తమ ఏలుబడిలో ఉందని చాటిచెప్పుకొనేందుకు ఎక్కడపడితే అక్కడ తమ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకొంటుంటారు. వాటిని బట్టి అది వారి రాజ్యమని దానిలో ఇతరులు ప్రవేశించకూడదని అర్ధం చేసుకొంటారు. ఈవిదంగా మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరి రాజ్యాలు వారు ఏర్పాటు చేసుకొని దానిని ఇష్టారాజ్యంగా ఏలుకొంటున్నప్పుడు, అదే రాజ్యంలో తమ పార్టీకే చెందిన మరొకనేత తన ఫ్లెక్సీలను ఏర్పాటుచేసుకోవడం అంటే తమ రాజ్యాన్ని అతను ఆక్రమించుకొన్నట్లే లెక్క.
అయితే రాజ్యాధిపత్యం కోసం ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలతో కూడా పోరాడవలసివచ్చినప్పుడే ఈవిదంగా ఆక్రోశించవలసివస్తుంది. కానీ కర్రున్న వాడిదే బర్రె అన్నట్లు ఎవరు కుర్చీలో కూర్చోంటే వారికే ఆ రాజ్యంపై సర్వాధికారాలు, సర్వహక్కులు దఖలు పడతాయని రెండున్నరేళ్ళు మంత్రిగా నెల్లూరు రాజ్యాన్ని ఏలిన అనిల్ కుమార్‌కి తెలియదనుకోలేము.
Director’s Cheap Talk on Heroines Sleeping for Films
Allu Arjun Fans Behaving Like NTR Fans!