akkineni fans suicide attempt for akhil disasterతెలుగు ప్రేక్షకులు ఒక హీరోను ఎంతగా అభిమానిస్తారో గతంలో పలు సార్లు రుజువు అయిన విషయం తెల్సిందే. తమ అభిమాన హీరోల కోసం ప్రాణ త్యాగంకు కూడా ఫ్యాన్స్‌ సిద్దంగా ఉంటారు అని మరోసారి ‘అఖిల్‌’ చిత్రం విడుదల సందర్బంగా రుజువు అయ్యింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కి నేడు విడుదల అయిన ‘అఖిల్‌’ సినిమా టికెట్లు దొరకలేదన్న మనో వేదనతో ఇద్దరు అక్కినేని ఫ్యాన్స్‌ ఒంటిపై కిరోషిన్‌ పోసుకుని ఆత్మ హత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అక్కడ ఉన్న వారు జాగ్రత్త పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళ్తే… తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన ‘అఖిల్‌’ చిత్రం కర్నూలులోని ఆనం థియేటర్‌లో కూడా విడుదల అయ్యింది. సినిమా మొదటి ఆటకు కొన్ని టికెట్లు మాత్రమే ఇచ్చి ఎక్కువగా బ్లాక్‌లో అమ్మారని, ఎక్కువ మొత్తం పెట్టి టికెట్లు కొనలేమని, తమ అభిమాన హీరో ‘అఖిల్‌’ సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడకుండా ఉండలేం అంటూ ఫ్యాన్స్‌ ఒంటిపై కిరోషిన్‌ పోసుకుని ఆత్మ హత్యకు ప్రయత్నించారు. ఈ ఒక్క సంఘటన మినహా తెలుగు రాష్ట్రాల్లో ‘అఖిల్‌’కు ఎలాంటి అవాంతరాలు లేకుండా విడుదల అయ్యింది.