roja vulger speech in assemblyనగరి నియోజకవర్గపు వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినందుకు గానూ తాము కూడా సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పి, ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీ నుండి ‘బాయ్ కాట్’ చేసిన విషయం తెలిసిందే. అయితే, సస్పెన్షన్ ఎత్తివేయమని అడిగే పధ్ధతి ఇది కాదని, అయినా రోజా వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, అందుకే ఒక ఏడాది పాటు ఆమెను సమావేశాల నుండి బహిష్కరించామని స్పీకర్ మరోమారు స్పష్టం చేసారు.

సామాన్య ప్రజలకు సంబంధించినంత వరకు ఇదే తెలుసు. అయితే అసలు సభలో రోజా ఏం మాట్లాడింది? నిజంగా బహిష్కరించేటంత పదజాలాన్ని రోజా ఉపయోగించిందా? జగన్ మొండివాదన ఆడుతున్నారా? లేక అధికార పక్షమే కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీపై వ్యవహరిస్తోందా? ఇలాంటి అనేక ప్రశ్నలు సగటు పౌరుడి మదిలో మెదులు తున్నాయి. వీటికి సమాధానం వెతుక్కోవాలంటే అసలు సభలో రోజా ఏం మాట్లాడిందో తెలుసుకోవాల్సిందే. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆ వీడియో వీక్షించిన తర్వాత అధికార పక్షంపై సగటు ప్రజలు సైతం విమర్శలు చేయడం సహజమే!

సభలో రోజా పలికిన పలుకులు….
‘ముఖ్యమంత్రి ఉండగా మహిళల గురించి మాట్లాడుతున్నారు. నేను ఆమెలా మొగుణ్ణి కొట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్ళలేదు, “ఎవరితో పడితే వాళ్ళతో పడుకోలేదు,” నా గురించి ఎవరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అధ్యక్షా… చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి పిలిచి అబద్ధాలు చెబుతున్నాడంటే ఆయన స్థాయి ఎంతగా దిగజారిందో అర్ధమౌతోంది.’ అంటూ రోజా పలికిన అసభ్యకరమైన పదజాలం కర్ణకఠోరంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే భాష ఇదేనా? సిగ్గు సిగ్గు..!

ఇపుడు అధికార పక్షం తీసుకున్న చర్యల విషయానికి వస్తే… ఖచ్చితంగా అధికార ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిందించాల్సిందే…. ఎందుకంటే… కేవలం ఒక్క సంవత్సరం బహిష్కరణ మాత్రమే విధించినందుకు..! ప్రజా సమస్యలకు “దేవాలయం”గా భావించే శాసనసభలో రోజా చేసిన వ్యాఖ్యలకు ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినా తప్పు లేదనే మాటలు రాజకీయ నిపుణుల నుండే వ్యక్తమవుతున్నాయి. లేకుంటే 2019 వరకు ఆమె శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంచినా తప్పు లేదనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.

ఇక, జగన్ విషయానికి వస్తే… ఇంత అసభ్యకరంగా మాట్లాడిన సమయంలో సభలోనే ఉన్న జగన్, కనీసం రోజాను నియత్రించకపోగా, సదరు వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చి, సభ క్షమాపణ చెప్పి మరీ రోజాను వెనక్కి తీసుకు రావలసిందిగా సభలో గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారంతో మహిళల పట్ల జగన్ వైఖరి ఏమిటో స్పష్టమవుతోందని సోషల్ మీడియా జగన్ ను దుమ్మెత్తిపోస్తోంది. ఒక పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా తప్పు చేసిన సొంత పార్టీ వారిని మందలించకపోగా, వారిని సమర్థించి ప్రోత్సహించడం చూస్తుంటే… జగన్ పట్ల, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజల్లో ఏహ్యభావన ఏర్పడుతోంది.

లీక్ అయిన ఈ వీడియోతో వైసీపీ వర్గం అవాక్కయ్యింది. జగన్ తో సహా అందరూ ప్రస్తుతం షాక్ లో ఉన్నారు. అయితే ఏం ప్రయోజనం… క్రింద పడినా తనదే పై చేయి అన్న చందంగా ఇంతటి “బూతు పురాణాన్ని” ఇంకా సమర్దిస్తూనే, వారు మాట్లాడిందే సమంజసమని వాదిస్తున్నారు. అభిమానం ఉండవచ్చు గానీ, మరీ ఇలాంటి విషయాలను కూడా సమర్ధించేటంత అభిమానం చివరికి ‘అగౌరవానికే’ దారి తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా జగన్, రోజాలను సమర్ధిస్తారా… వారందరికీ ఓ కోటి దండాలు..!