vakeel saab director about working with pawan kalyan”ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు.
నాని హీరోగా ‘ఎంసీఏ’ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకున్న ఈ
టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ తో “వకీల్ సాబ్”
చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శ్రీరామ్
వేణు…ఒక అభిమానిగానే “వకీల్ సాబ్” సినిమా చేశానని చెబుతున్నారు. “వకీల్
సాబ్” సినిమాకు దర్శకత్వం వహించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్న
శ్రీరామ్ వేణు..ఆ విశేషాలు చూస్తే…

క్వారెంటైన్ వల్ల అందరం ఇళ్లలోనే ఉన్నాం. ఇన్నాళ్లూ థియేటర్
సెలబ్రేషన్స్ కు ఆడియెన్స్ కు దూరంగా ఉన్నారు. మొన్న థియేటర్లో వకీల్
సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ పావు గంట లోపలికి వెళ్లేందుకు మరో
పావుగంట బయటకు వచ్చేందుకు పట్టింది. అంత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు
ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి. పవన్ గారి సినిమా కోసం వాళ్లు ఎంత వేచి
చూస్తున్నారో అప్పుడు అర్థమైంది.

అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. ఈ
ప్రాజెక్ట్ ను ఎంతో సంతోషంగా తీసుకున్నాను. మేకింగ్ టైమ్ లో ఎక్కడా
ఒత్తిడికి గురి కాలేదు. దర్శకుడిగా చెబుతున్నా.. వకీల్ సాబ్ సినిమా
బాగుంటుందనే పూర్తి నమ్మకం ఉంది. మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే
సంతృప్తిని సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నా. కష్ట సుఖాలు ప్రతి పనిలో
ఉంటాయి. ఒత్తిడి, కష్టం ప్రతి సినిమాకు, ప్రతి దర్శకుడికి ఉంటాయి. ఎంసీఏ
టైమ్ లోనూ ప్రెజర్ ఉంది. వకీల్ సాబ్ సినిమా చేసేప్పుడు ప్రతి రోజూ ఎంజాయ్
చేశాను. పవన్ గారిని చూడగానే సంతోషం కలుగుతుంది. హ్యాపీగా ఫీలవుతాను.

ఈ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు పవన్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నాతో
మాట్లాడుతూ… పింక్ రీమేక్ సినిమాను ఎలా చేద్దామనుకుంటన్నారు, మీ
ఆలోచనలు ఏంటి అని అడిగారు. ఈ కథను మీరు ఎలా తెరకెక్కించాలని
ఆలోచిస్తున్నారు అని తెలుసుకున్నారు. కళ్యాణ్ గారితో రెండు మూడు సార్లు
మీటింగ్ జరిగింది. వకీల్ సాబ్ కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ గురించి
నేను అనుకునే విషయాలు ఆయనతో చెప్పాను.ఆయన కూడా కొన్ని ఇన్ ఫుట్స్
ఇచ్చారు.దాన్ని బట్టి ముందుకు వెళ్ళాం. కళ్యాణ్ గారికి వేర్వేరు రకాల
ఆడియెన్స్ ఉంటారు. ఏ,బీ,సీ అనే కేటగిరీలు ఉంటాయి. వాళ్లందరికీ చేరేలా
సినిమాను రూపొందించాను. పింక్ ఒరిజినల్ అలా ఉండదు. కథ రాస్తున్నప్పుడు,
స్క్రీన్ ప్లే విషయంలో, మాటల విషయంలో పవన్ గారి ఇమేజ్ గుర్తు చేసుకుంటూ
వచ్చాను.

సబ్జెక్ట్, నేను రాసుకున్న స్క్రీన్ ప్లేకు తగినట్లే పవన్ గారు, నాయికల
క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రైలర్ లోనే కథ చెప్పేశాను. ట్రైలర్ చూశాక మీకు
అది అర్థమయి ఉంటుంది. వుమెన్ ఎంపవర్ మెంట్ గురించి ఇప్పటికే రెండు
భాషల్లో ఇదే సినిమా చేశారు. వకీల్ సాబ్ లోనూ ఆ మెయిన్ పాయింట్ ఉంటుంది.
అది వదిలేసి, కోర్ పాయింట్ తప్పించుకుని వేరే విధంగా సినిమాను
రూపొందించలేదు.

నా మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సరిగ్గా ఆడలేదు. ఆరేడేళ్లు టైమ్ తీసుకుని
ఎంసీఏ చిత్రాన్ని చేశాను. ఫ్రెండ్స్ కథతో ఓ మై ఫ్రెండ్, వదిన మరిది
కాన్సెప్ట్ తో చేసిన ఎంసీఏ ఈ రెండు సినిమాలు వకీల్ సాబ్ సినిమా చేసేందుకు
ఉపయోగపడ్డాయి. నా ఫస్ట్ సినిమా రిలీజై ఈ నవంబర్ కు సరిగ్గా పదేళ్లు
పూర్తవుతున్నాయి. నాకు సినిమాలంటే ఇష్టం. హిట్స్ ఫ్లాప్స్ ఏది వచ్చినా
ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను.

పవన్ గారితో పనిచేయాలి అనేది నా డ్రీమ్. నా జీవితంలో ఏడేళ్లు సినిమాకు
దూరంగా ఉన్నాను. అదే నా జీవితంలో అది పెద్ద కష్టం. ఇక అంతకంటే కష్టమేదీ
ఉండదు. పవన్ గారితో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నా పని
ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. కోర్ట్ రూమ్ డ్రామా
కాబట్టి, దాన్ని మార్చలేదు. కోర్ ఐడియా అలాగే ఉంటుంది.

ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం, ట్రేడ్ దాని
చుట్టూ అల్లుకుని ఉంటాయి. దానికి తగినట్లే వకీల్ సాబ్ సినిమా
తెరకెక్కించాను. ట్రైలర్ లో చూసినట్లు, ఎక్కువ సేపు కోర్ట్ రూమ్ డ్రామానే
చూపించాను. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఎలాంటి గొప్ప స్పందన వస్తుందో
చూడాలి.

ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా తెల్లవారి పెన్ పేపర్ పట్టుకుని
నా పని నేను చేయాల్సిందే. నేను మనసును నమ్ముతాను. జయాపజయాలు ఏది వచ్చినా
మన పని మనం చేయాల్సిందే అని నమ్ముతాను. ప్రతి వంద కిలోమీటర్లకు
భారతదేశంలో ప్రతిదీ మారిపోతుంటుంది. హిందీ పింక్ ఒకలా ఉంటుంది. తమిళ
పింక్ మరోలా ఉంటుంది. పవన్ గారు అంటే ఏంటో, ఒక అభిమానిగా, దర్శకుడిగా
నాకు తెలుసు. కాబట్టి ఆయనకు సరిపోయేలా సబ్జెక్ట్ మార్చి చేశాను.

ఎవరి ఊహలకు తగినట్లు సినిమా చేయలేను. బద్రి సినిమాను గుర్తు చేయడానికే
ప్రకాష్ రాజ్ గారి పాత్రకు నందా అని పెట్టాను. అందులో సందేహం లేదు. పవన్
కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్
చేస్తారో చెప్పలేము. అది సంగీత దర్శకుడు థమన్ గారు రివీల్ చేస్తారు.

పవన్ కళ్యాణ్ గారితో ప్రతి ఒక్క దర్శకుడు సినిమా చేయాలని కోరుకుంటారు.
పవన్ గారికున్న స్టేచర్ కు వుమెన్ ఎంపవర్ మెంట్ కంటే మంచి కాన్సెప్ట్
ఉండదు. ఆయనకు ప్రస్తుతం బాధ్యత గల సినిమాల కరెక్ట్. ఇంతకంటే కమర్షియల్
కథలు కూడా మరేముంటాయి.

నో అంటే నో అనే అంశం వకీల్ సాబ్ కథలో ఎలా ఉంటుందో మీరు తెరపైనే చూడాలి.
నేనో కథ రాశాను, ఓ పాత్రను డిజైన్ చేశాను. అందులో ఎలాంటి పొలిటికల్
వ్యూస్ ఉన్నాయో లేదో అనేది చెప్పలేను. మీరు సినిమా చూసి చెప్పాలి. పింక్
కథలో మార్పులు చెప్పినప్పుడు పవన్ గారు బాగున్నాయని అన్నారు. పవన్ గారితో
ప్రతి రోజూ బెస్ట్ మూవ్ మెంట్ అనుకోవచ్చు. మిగిలిన పుటేజ్
చూసుకున్నప్పుడు కూడా నాకు ఎగ్జైటింగ్ గానే ఉంది.

వకీల్ సాబ్ సినిమా విషయంలో నేను ఒత్తిడికి లోనయ్యే టైమ్ కూడా లేదు. కథ
కుదిరింది, ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. సినిమా చేసుకుంటూ వెళ్లాం. నెక్ట్
సినిమా గురించి ఇంకా స్పష్టత లేదు.త్వరలో డీటెయిల్స్ చెప్తాను.
హానెస్ట్లీ వకీల్ సాబ్ తీసుకొచ్చే ఎలాంటి రికార్డ్స్ గురించి ఆలోచించడం
లేదు. మొన్న ఫ్యాన్స్ తో మీటింగ్ జరిగింది. మనకు సినిమా రికార్డ్స్ తో
గుర్తుండదు. ఒక సినిమా అంకెలతో గుర్తుండదు. మనం ఎమోషన్ తో కనెక్ట్ అయితే
ఆ సినిమా ఎప్పటకీ గుర్తుంటుంది. బొమ్మరిల్లు సినిమాను మనం అంకెలతో
గుర్తుపెట్టకోలేదు కదా.

వకీల్ సాబ్ లోని ఒక స్టిల్ లీక్ చేశారు ఫ్యాన్స్. అది బాగుందని చూసి. ఆ
స్టిల్ నే పోస్టర్ లో పెట్టాను. లాయర్ సాబ్, మగువా లోకానికి తెలుసా నీ
విలువ లాంటి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను
డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం. మగువా మగువా అని
పదాలు పెట్టాలని నేనే సూచించాను.

ఒక క్యారెక్టర్ ఇన్నోసెంట్ గా ఉండాలి. ఆ క్యారెక్టర్ కు అనన్య
నాగ‌ళ్లను తీసుకున్నాను. కాన్ఫిడెన్స్ ఉన్న మరో అమ్మాయి పాత్రకు అంజలిని
తీసుకున్నాం. టుడేస్ గర్ల్ క్యారెక్టర్ కు కావాల్సి వచ్చినప్పుడు
నివేదాను సెలెక్ట్ చేశాం. ఈ ముగ్గురూ తమ క్యారెక్టర్స్ చక్కగా చేశారు’’
అంటూ తన ఇంటర్వూ ముగించారు.