Music director Thaman praisesసహజంగా ఒక చిన్న సినిమా గురించి ఒక పెద్ద టెక్నీషియన్ మాట్లాడటం చాలా అరుదు. అదే సేమ్ ఫీల్డ్ లో ఉండే వారు అదే ఫీల్డ్ లోని చిన్న టెక్నీషియన్ పనితనం గురించి అసలు మాట్లాడారు. అయితే తమన్ కు మాత్రం అటువంటి భేషజాలు లేవు.

రిచి గాడి పెళ్లి అనే చిన్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుండి అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా”  పాటను బాహుబలి, భరత్ అనే నేను,, మున్నా,మిర్చి, పరుగు అరుంధతి,గోపాల గోపాల, రాజన్న వంటి అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు పాడిన ఖైలాష్ ఖేర్ ఈ పాట పాడారు.

ఈ పాటను తమన్ ఎంతగానో మెచ్చుకున్నాడట. “రిచిగాడి పెళ్లి లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ చూశాను. కైలాష్ గారు ఏక్స్ట్రార్డినరీగా పాడారు,  తన వాయిస్ ఈ పాటకి  చాలా బాగుంది. ఈ సాంగ్  వింటుంటే నన్ను లొకేషన్ కు తీసుకెల్లింది. అనంత శ్రీరామ్ గారి లిరిక్స్ లో కైలాస్ గారు బ్యూటిఫుల్ గా పాడారు, సత్యన్‌ చాలా బాగా  కంపోజ్ చేశారు, ఈ సినిమా అందరికీ మంచి హిట్ కావాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు

ఈ చిత్ర దర్శకుడు కె యెస్ .హేమరాజ్ తమన్ తో వైశాలి అనే సినిమాకు పని చేశారు. “నాకు హేమ రాజ్  వైశాలి సినిమా నుంచి తెలుసు ఈ సినిమాకు ఆయన పని చేయడం చాలా ఆనందంగా ఉంది, అందరూ మంచి ప్రయత్నం తో ఈ సినిమా చేస్తున్నారు, అందరూ సపోర్ట్ చేయాలి,” అని తమన్ చెప్పుకొచ్చాడు.

నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాలో సత్య ఎస్కె, కిషోర్ మర్రి శెట్టి, ప్రవీణ్ రెడ్డి, సతీష్ శెట్టి, బన్నీ వోక్స్, చందనరాజ్, కియారా నాయుడు, మాస్టర్ రాకేశ్ తమోఘ్నా తదితరులు నటిస్తున్నారు. కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నిర్మాణం.