సస్పెన్స్ థ్రిల్లర్ గా “మిస్సింగ్” చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు
శ్రీని జోస్యుల. ఆడియెన్స్ కనెక్ట్ అయితే “మిస్సింగ్” తప్పకుండా విజయం
సాధిస్తుందంటున్నారీ డెబ్యూ డైరెక్టర్. ఈ చిత్రాన్ని బజరంగబలి
క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు.
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన
“మిస్సింగ్” సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా
దర్శకుడు శ్రీని జోస్యుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్ “మిస్సింగ్”
మూవీతో తమ జర్నీ ఎలా సాగిందో తెలిపారు.

దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ…దర్శకుడిగా ప్రయత్నాలు
మొదలుపెట్టాక కొన్ని కథలతో హీరోలు, ప్రొడ్యూసర్స్ ను అప్రోచ్ అయ్యాను.
వాళ్లు ఆ కథలు విని…ఈ కథలకు చాలా పెద్ద బడ్జెట్ కావాలి. కొత్త
దర్శకుడివి ఎలా నమ్మి చేస్తాం అన్నారు. అప్పుడు నన్ను ప్రూవ్
చేసుకోవడానికి ఒక చిన్న సినిమా ముందు చేద్దామని “మిస్సింగ్” ప్లాన్స్
మొదలుపెట్టాను. ముందు ఇది కాంపాక్ట్ బడ్జెట్ లో అనుకున్న సినిమా. కానీ
రెండు లాక్ డౌన్స్, ప్రొడక్షన్ లో మాకు ఎక్సీపిరియన్స్ లేకపోవడం వల్ల
అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యింది. హీరో హర్ష నాకు ఫ్రెండ్. అతను
ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలడు అని నాకు నమ్మకం. మిస్సింగ్ కథకు అతను
హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.
అబద్ధంతో కథ మొదలుపెట్టి, సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సినిమా సాగుతుంది.
ఎక్కడ కథ మొదలైందో చివరలో అక్కడే ఎండ్ అవుతుంది. ఇదొక సక్సెస్ ఫుల్
స్క్రీన్ ప్లే ఫార్ములా. చాలా గొప్ప సాహిత్యం, సినిమాల్లో ఇది ప్రూవ్
అయ్యింది. ఆడిషన్స్ ద్వారా హీరోయిన్లు నికీషా, మిషాను తీసుకున్నాం. మిషా
నారంగ్ మా సినిమా తర్వాతే తెల్లవారితే గురువారం సినిమాలో నటించింది.
నికిషీ కూడా తెలుగు అమ్మాయి కాదు. కానీ వాళ్లు డెడికేటెడ్ గా తెలుగు
డైలాగ్స్ నేర్చుకుని నటించారు. జీఏ2 ద్వారా బన్నీ వాస్ గారు మాకు
థియేటర్స్ సపోర్ట్ చేశారు. నైజాంలో ఏషియన్ సినిమాస్ ద్వారా రిలీజ్
చేస్తున్నాం. మల్టీప్లెక్సులు కలిపి మంచి నెంబర్ థియేటర్స్ పడుతున్నాయి.
నిన్న ప్రెస్ షో వేశాం. మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సినిమా
బాగుందంటూ మీడియా మిత్రులు చెప్పడంతో మా టెన్షన్ ఎగిరిపోయింది. ఇక
ఆడియెన్స్ స్పందన కోసం వేచి చూస్తున్నాం. సినిమా అనేది వ్యాపారం. మన
దగ్గర టాలెంట్ ఉంటేనే ఎవరైనా ఆదరిస్తారు. మనల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడ
ఎవరూ వెయిట్ చేస్తూ ఉండరు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా బాగుంది
కాబట్టి పెద్దవాళ్లు కలిసి రిలీజ్ చేశారు. అలా మన సినిమాలో విషయం ఉంటే
ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుంది. నెక్ట్ ఒక లవ్ స్టోరితో సినిమా చేయాలని
అనుకుంటున్నాను. నాని, ప్రభాస్..ఇలా చాలామంది హీరోలతో పనిచేయాలనే డ్రీమ్
ఉంది. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్ మాట్లాడుతూ…హర్ష, శ్రీని, నేను అంతా
ఫ్రెండ్స్. ఫిల్మ్ స్కూల్ లో చదువుకుంటున్నప్పటి నుంచి కలిసే ఉన్నాం.
సినిమా ప్లానింగ్ లో ఉన్నప్పుడు అంతా కష్టపడే కంప్లీట్ చేయాలని
నిర్ణయించుకున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా “మిస్సింగ్” మూవీకి నా
కంప్లీట్ ఎఫర్ట్ పెట్టాను. ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ కాబట్టి ఎన్నో
ఎక్సీపిరియన్స్ లు చూశాం. ఇది థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసం చేసిన సినిమా.
ఎన్నో ఓటీటీ ఆఫర్స్ వచ్చినా ఇవ్వలేదు. సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్
చేసిన వాళ్లం మనమంతా. అందుకే థియేటర్ అంటే అభిమానం ఉండిపోయింది.
మిస్సింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథలో టర్నింగ్స్ తో మిమ్మల్ని
ఆకట్టుకుంటుంది. అన్నారు.