Karthi's Naa Peru Shiva 2 releasing in Januaryకోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్
మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో నా పేరు
శివగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
స్టూడియో గ్రీన్ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని
నిర్మించారు.

ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు సినిమాలు స్టూడియో
గ్రీన్ సంస్థ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా అభిరుచిని, ఆయన సినిమాల్లోని
గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి. కబాలి, సార్పట్ట పరంబరై వంటి
చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ నా పేరు శివ
2 సినిమాను రూపొందించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా
పేరు శివ 2 సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ
నెలలోనే నా పేరు శివ 2 సినిమా థియేటర్ లలో రిలీజ్ కానుంది.

నటీనటులు – కార్తి, క్యాథరీన్ థెరిసా, కలైయరాసన్ తదితరులు

సాంకేతిక నిపుణులు

సంగీతం – సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ- మురళి. జి
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె ఇ జ్ఞానవేల్ రాజా
రచన దర్శకత్వం – పా రంజిత్
పీఆర్వో – జీఎస్కే మీడియా