హన్సిక మొత్వాని కథానాయికగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా
”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్” తో ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ
కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’.

చిత్ర గ్లింప్స్ వీడియోని పాపులర్ సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్
కుమార్ విడుదల చేస్తూ “హాలీవుడ్ లో మాత్రమే ప్రయత్నించిన సింగిల్ షాట్
చిత్రీకరణ కి నేను పెద్ద అభిమాని ని అలా మానవాళ్లెవరు చెయ్యట్లేదు
అనుకుంటుండగా ‘105 మినిట్స్’ రాజు చేసి చూపిస్తున్నారు. కథ కథనం చాలా
థ్రిల్లింగ్ గా అనిపించాయి. 105 మినిట్స్ సింగిల్ షాట్ అంటే ఒక
టెక్నీషియన్ గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి
కొత్త తరం ఆలోచనతో కథలు తెరకెక్కిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి
ఒక రిస్కి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి.
అనుక్కున్నట్టుగా తీసిన చిత్ర బృందం అంతటికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ని
ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Also Read – మిస్టర్ ప్రెగ్నెంట్’ సాంగ్ విడుదల

రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్
పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు, సామ్ సి.యస్ సంగీతం
అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలని వేగంగా
జరుపుతుంది చిత్ర బృందం.

Also Read – కోలీవుడ్ స్టార్ కార్తి, స్టూడియో గ్రీన్ “నా పేరు శివ 2” జనవరిలో థియేటర్ లలో విడుదల

సాంకేతిక వర్గం:
నిర్మాత – బొమ్మక్ శివ
డైరెక్టర్ – రాజు దుస్సా
డిఓపి – కిషోర్ బొయిదాపు
మ్యూజిక్ – సామ్ సి.యస్
ఆర్ట్ – బ్రహ్మ కడలి
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ – రూపాకిరణ్ గంజి
స్టిల్స్ – గుణకర్
మేకప్ – డెక్క బాలు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – సురేష్ బాబు
పి. ఆర్. ఓ – జి. ఎస్. కె మీడియా
పబ్లిసిటీ డిజైనర్ – సుధీర్