YS Jagan -Delhiఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గత వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసొచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులకే కాబోయే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై యుద్ధం ప్రకటించారు.

దీనితో మోడీ అభయంతోనే న్యాయవ్యవస్థ మీద దాడి చేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈలోగా మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి ఆఫీస్ కు అప్పోయింట్మెంట్ కావాలని అర్జీ పెట్టుకుందని, అది వచ్చిన వెంటనే జగన్ ఢిల్లీ వెళ్తారని సమాచారం.

ఈ వారంలోనే జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రికి ప్రధాని కార్యాలయం ఒకేనెలలో రెండు సార్లు అప్పోయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు చాలా అరుదు. దీనితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయని చెప్పుకోవచ్చు.

జగన్… మోడీల బంధం ఏమిటి అనేది రాష్ట్ర బీజేపీ నాయకులకు, మిత్రపక్షం జనసేనకు కూడా అర్ధం కాకుండా ఉంది. దానితో అసలు ఏ విధంగా ఈ వ్యవహారాల పై స్పందించాలో వారికి అర్ధంకాక తికమక పడుతున్నారు. అసలు అటువంటి అంశమే లేనట్టుగా మీడియాకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు ఆ నాయకులు.