2020 GOLMAALమిట్టకంటి రామ్ , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి
మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకేకించిన కొత్త చిత్రం ”
2020 గోల్ మాల్” రిలీజ్ కు రెడీ అవుతోంది.ఫిబ్రవరి 18న ఈ సినిమాను
ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

‘‘అమృతారామమ్” తర్వాత రామ్, “దేవరకొండలో విజయ ప్రేమకథ”, “కపటనాటక
సూత్రధారి” తర్వాత విజయ్ శంకర్ నటిస్తున్న ” 2020 గోల్ మాల్” చిత్రం పై
అంచనాలు బాగానే ఉన్నాయి.

“2020 golmaal” చిత్రాన్ని నూతన దర్శకుడు జాన్ జిక్కి తెరకెక్కించారు.
కె.కె.చైతన్య సమర్పిస్తున్న ఈ మూవీని “బాబీ ఫిలిమ్స్ ” ప్రొడక్షన్
నిర్మించింది . పాండమిక్ వల్ల విడుదల కోసం వేచి చూసిన “2020 golmaal”
టీమ్ సరైన డేట్ ను ఫిక్స్ చేసుకుంది. feb18న సినిమా విడుదలకు ముహూర్తం
నిర్ణయించింది.

“2020 golmaal ” చిత్రంలోని ఇంతలొ ఎన్నిని వింతలో పాట
ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి సింగర్ జావీద్ అలీ, సుకుమారి..సుకుమారి..
అర్మాన్ మాలిక్ పాడిన పాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి . రిలీజ్ డేట్
అనౌన్స్మెంట్ సందర్భంగా

డైరెక్టర్ జాన్ మాట్లాడుతూ…” 2020 గోల్ మాల్” ఒక కాన్సెప్ట్ బేస్డ్
మూవీ. ఇందులో రామ్ ఇంకా విజయ మిగిలిన పత్రాలు అందరు రెట్రో లుక్ లో
కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మనం గతంలో కోల్పోయిన ప్రేమ తాలుకు
జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటె జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ , ఇది
ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ కామెడీ డ్రామా , ఫ్యామిలీ అంతా చూడదగ్గ
చిత్రం.రిట్రో మిక్స్ అయినా చిత్రం feb 18న థియేటర్లలో కలుసుకుందాం ”
అన్నారు

టెక్నికల్ టీమ్:
సమర్పణ : బాబీ ఫిలిమ్స్
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
రిట్రో కాన్సెప్ట్ : బాబీ కె.ఎస్ .ఆర్
సినిమాటోగ్రఫీ: జగన్ . ఏ
ఎడిటర్ : నాహిద్
మ్యూజిక్: కనిష్క
నిర్మాత: కే.కే చైతన్య
రచన-దర్శకత్వం: జాన్ జక్కి