will-jagan-warn-his-party-leadersతెలంగాణాలో ప్రతిపక్షం లేకుండా ఏలదామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. అయితే మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ నుండి ఫలానా వారు పార్టీ మారబోతున్నారన్న వార్తలు రాగానే, పార్టీ అధినేత నాయనో, భయానో పార్టీ మారకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనను చూసాం.

అయితే తాజాగా మరోసారి వైసీపీ ఎమ్మెల్యేల పార్టీ మార్పు రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. ప్రకాశం జిల్లాకు సబంధించిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మరియు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి బ్యాక్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తన బ్లాగ్ లో తెలిపారు. అయితే వీరి రాకకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కారణం బలరాం, దివి శివరాంల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారట.

రాజకీయ, మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తున్న ఈ అంశం ఏదొక సమయంలో జగన్ చెవిన పడటం ఖాయం. మరి ఈ సారి ఈ నాయకులను జగన్ ఎలా నియత్రించగలరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కడప జిల్లాకు చెందిన నాయకులపై కూడా ఇలాంటి వార్తలే ప్రచారం కావడంతో… వారిని కాస్త భయపెట్టి ఆపగలిగారని రాజకీయ వర్గాల్లో జరిగిన ప్రచారం తెలిసిందే. మరి ఈ సారి కూడా అదే ఫార్ములాతో ముందుకెల్తారా? లేక బ్రతిమలాడతారా? అన్నది వేచి చూడాలి.