vangaveeti is best story in my career says rgvవిజయవాడ ‘రౌడీయిజం’ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. అంతేకాదు, విజయవాడ జనాలు అన్నా కూడా ఒక ప్రత్యేకత ఉంటుందని ఇతర ప్రాంతాల ప్రజలు బలంగా వాదిస్తుంటారు. అందుకే ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో “ఆ విజయవాడోళ్ళు…” అంటూ ప్రత్యేకంగా సంబోధించి మరి డైలాగ్స్ చొప్పించారు. అలా ఒకప్పటి విజయవాడ చరిత్ర అందరినీ ప్రభావితం చేసింది. ప్రస్తుతం ఆ చరిత్రకు వెండితెర రూపం తెచ్చే పనిలో పడ్డారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ.

అంతేకాదు, “వంగవీటి” అనే పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కధే తన కెరీర్ లో అత్యుత్తమమని, ఇంతకంటే పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉన్న సబ్జెక్ట్ దొరకదని, అందుకే ఈ సినిమానే తెలుగులో తన చివరి సినిమాగా ప్రకటించానని… ఈ సినిమా కధ చలసాని వెంకట రత్నంను వంగవీటి రాధా చంపడంతో ప్రారంభమై, వంగవీటి రంగా హత్యతో ముగుస్తుందని తెలిపారు.

అలాగే ఈ సినిమాలో అప్పటి రాజకీయ నేతలైన రాజీవ్ గాంధీ, దాసరి నారాయణరావులతో పాటు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పాత్రలు కూడా ఉంటాయని స్పష్టం చేసారు. హైదరాబాద్ లో పెరిగిన తానూ విజయవాడ రౌడీయిజాన్ని తన కళ్ళతో చూశానని, అదే “వంగవీటి” సినిమాలో చూపించబోతున్నానని వర్మ తన చివరి సినిమా విశేషాల గురించి చెప్పుకొచ్చారు.