TDP Supporting Congressఅవును.. పోస్టర్ చూసినవాళ్లంతా వాటే ఫొటోగురూ అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉప్పు-నిప్పులా సాగిన కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు స్నేహ హస్తం అందించుకోవడం ఈ ఫొటోలోని హైలైట్ అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టిడిపి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకే అభ్యర్థికి మద్దతివ్వడం మరో హైలెట్.

ఇంకా విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్ ల నుండి టిడిపి అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా అందరూ ఒకే పోస్టర్ లో దర్శనమివ్వడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇలా ప్రధాన ప్రత్యర్థిపార్టీలన్నీ ఒకటై టిఆర్ఎస్ అభ్యర్థిపై దండెత్తుతున్నాయి. ఈ పోటీలో గెలుపెవరిదో చూడాలి.