sudheer babu cameo in super star krishna sri sri movieసూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వం వహిస్తున్న “శ్రీ శ్రీ” సినిమాలో అతిథి పాత్ర చేయడానికి కృష్ణ అల్లుడు సుధీర్ బాబు సిద్ధమయ్యాడు. క్లైమాక్స్ లో కనిపించే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రను సుధీర్ బాబు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ నేడు జరుగుతోంది. సుధీర్ బాబుతో పాటు ఆయన తనయుడు మాస్టర్ దర్శన్ కూడా “శ్రీశ్రీ”లో భాగస్వామి అయ్యారు.

ఈ సినిమాకు ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనుండడం మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా ఆడియోను ఈ నెల 18వ తేదీన దాసరి నారాయణరావు, మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. “మహాకవి శ్రీశ్రీ రచనలు ఓ సామాన్యుడిలో స్పూర్తిని రగిలిస్తే, అతని జీవితం ఎలా ఉంటుందనేదానికి రూపమే ఈ చిత్ర కధ అని, వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని” చిత్ర యూనిట్ తెలిపింది. మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.