salman-khan-sultan-trailer-talk-goodబాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుల్తాన్‌’ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఐపీఎల్ లో భాగంగా సెట్ మాక్స్ నిర్వహించే ‘ఎక్స్ ట్రా’ ఇన్నింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్, అనుష్కలు ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ, ఈ సందర్భంగా “సుల్తాన్” చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌ రూపొందిన ఈ సినిమాలో సల్మాన్, అనుష్కల పాత్రలను ఇంతకు ముందే టీజర్ రూపంలో విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన ‘సుల్తాన్’ ట్రైలర్ కు వీక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తోంది.

రెజ్లర్ ‘సుల్తాన్’ కిక్ బాక్సర్ గా మారిన వైనం సినిమా కధగా స్పష్టమైంది. అయితే మరో వైపు లవ్ స్టోరీని కనెక్ట్ చేస్తూ సాగిన సినిమా కధ సల్మాన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉండడంతో “సుల్తాన్”పై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. ఇప్పటికే నెలకొన్న అంచనాలను మరింత రెట్టింపు అయ్యే విధంగా ట్రైలర్ ఉండడంతో కండల వీరుడు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.