rumours on allu arjun sarainodu అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను మూవీ “సరైనోడు” గురించి ఓ కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఫస్ట్‌ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. స్టైలిష్‌స్టార్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని, ఓ ఎమ్మెల్యేకు సెక్యూరిటీగా ఉంటాడని, ఎమ్మెల్యే రోల్‌లో కేథరిన్ కనిపించనుందని టాక్. రకుల్ ప్రీత్‌సింగ్ మేకప్ లేకుండా రూరల్ యువతిగా దర్శనమిస్తోందని యూనిట్ చెబుతోంది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేతో బన్నీ డేటింగ్‌ చేస్తాడని, చివరకు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటాడు అనేది మెయిన్ స్టోరీ! యాక్షన్‌తో కూడిన లవ్ స్టోరీగా రానున్న ఈ ఫిల్మ్‌లో శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక రోల్స్ చేస్తున్నారు. ‘లోఫర్’ బ్యూటీ దిశాపటాని బన్నీతో స్పెషల్ ఐటమ్‌ సాంగ్ చేయనుంది. ప్రస్తుతం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వాలంటైన్ డే రోజు(ఫిబ్రవరి 14)న ఆడియో, తమన్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని బన్నీ బర్త్ డే సందర్భగా ఏప్రిల్‌ 8న రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్.