Rao Ramesh deleted dialogue in Brahmotsavam‘ఒక మంచి మాట’ అంటూ హీరో తండ్రి, హీరో పలు సందర్భాలలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మాట్లాడుతుంటారు. అయితే, వాళ్ళు చెప్పిన ఓ మూడు, నాలుగు డైలాగ్ లు మినహా మిగతావేమీ ఆశించిన రీతిలో వెండితెరపై పండలేదు. కానీ, ఇటీవల ఈ సినిమా విశేషాలను చెప్తూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నటులు జయసుధ, రావు రమేష్ చేసిన కార్యక్రమంలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ సినిమాలో పెట్టినా… అది సినిమాకే హైలైట్ అయ్యేదని అనిపించక మానదు.

‘ఒక మంచి మాట’ చెప్పాల్సిందిగా రావు రమేష్ ని యాంకర్ ఝాన్సీ అడగగా… “దర్శకుడు ఉద్దేశమే… ఎకరాల లెక్కన బ్రతికిన వాళ్ళంతా ఎస్.ఎఫ్.టిల లెక్క వచ్చేసాం… ఫ్లాట్స్ లోకి… సో… న్యూక్లియర్ బాంబు పేలిన చోట అయిదు వేల సంవత్సరాల వరకు గడ్డి మొలవదు… న్యూక్లియర్ ఫ్యామిలీలు ఇలాగే ఉంటే బంధం ఉండదు… నలుగురం కలిసి వెళ్లాలన్నదే దర్శకుడి ఆలోచన…” అని రావు రమేశ్ చెప్పగానే… బాగా చెప్పారు అంటూ శ్రీకాంత్ అడ్డాల ప్రశంసించగా, ‘సూపర్బ్’ అంటూ యాంకర్ ఝాన్సీ కొనియాడారు.

శ్రీకాంత్ అడ్డాల ఇద్దరూ స్టార్ హీరోలను పెట్టుకుని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ద్వారా సూపర్ హిట్ ఇవ్వడానికి… మహేష్ వంటి హీరోను పెట్టుకుని ‘బ్రహ్మోత్సవం’ ద్వారా విఫలం కావడానికి ప్రధాన కారణాలలో డైలాగ్స్ కూడా ఒకటి. సీతమ్మలో… దాదాపుగా ప్రతి డైలాగ్ వెండితెరపై అత్యద్భుతంగా పండింది. కానీ, ‘బ్రహ్మోత్సవం’లో మహేష్ చెప్పడానికి అవకాశం లేకపోగా, ఇతరులు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.