ram gopal varma Rai first lookఅండర్ వరల్డ్ డాన్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ తాజాగా “రాయ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను దాదాపు 55 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

క్రైమ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చో అనే దానిని నిరూపించిన ఏకైక వ్యక్తి.., జేబులో 30 రూపాయలు నుండి 30 సంవత్సరాల తర్వాత 30,000 కోట్ల వరకు ఎలా ఎదిగాడు… బ్యాంక్ లో క్లర్క్ నుండి ప్రస్తుతం అతనే ఒక బ్యాంక్ గా ఎలా రూపొందాడు… ఇలా ఆసక్తికరమైన అంశాలతో వర్మ మార్క్ “రాయ్” చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది.

‘రాయ్’ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా… వర్మ చెప్పిన స్టోరీ… పూరీ జగన్నాధ్ – ప్రిన్స్ మహేష్ బాబుల “బిజినెస్ మెన్” కధను తలపిస్తుండడం విశేషం. క్రైమ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చో, బ్యాంక్ దోపిడీ చేసిన వాడు బ్యాంక్ ను ఎలా స్థాపించాడో అనే విధానాన్ని ‘బిజినెస్ మెన్’ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు పూరీ. ‘శిష్యుడు’ చేసిన కధను ‘గురువు’ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తాడామో చూడాలి.