pawan kalyan working to release sardaar gabbar singh పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా స్పెషాలిటీ ఇది. ఈ సినిమా కోసం పవన్ తన కెరీర్ లోనే మొదటి సారిగా రెండు యూనిట్స్ తో పని చేస్తున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ… ఏప్రిల్ 8వ తేదీ నాటికి తన ‘సర్దార్’ మూవీ రిలీజ్ కావాలంటే ఈ మాత్రం హార్డ్ వర్క్ చేయాలని పవన్ కోరినట్టు సమాచారం. అందుకే ఒకేసారి రెండు యూనిట్లను రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తిందని ట్రేడ్ వర్గాల టాక్.

ప్రధాన తారాగణంతో సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఓ యూనిట్ ఉందని, దీనిని దర్శకుడు బాబీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా, కో-డైరెక్టర్ సారధ్యంలో మరో యూనిట్ సాధారణ సన్నివేశాలను కెమెరాలో బంధించే పని చేస్తోందని సమాచారం. మార్చి మొదటి వారం నాటికి సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నది చిత్ర యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది.