Janatha Garage Making, Janatha Garage Making Video, Janatha Garage Making Video Story, Janatha Garage Story Line Making Video, NTR Janatha Garage Makingసెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదల కాబోతున్న “జనతా గ్యారేజ్” సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు చిత్ర యూనిట్ పోస్టర్లను, వీడియోలను విడుదల చేస్తోంది. అందులో భాగంగా తొలుత విడుదల చేసిన ‘జనతా గ్యారేజ్’ పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్ అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘జనతా గ్యారేజ్’ సినిమాకు ఆయువుపట్టుగా ఉన్నటువంటి సెట్ రూపొందించిన విధానం, నటీనటుల అనుభవాలతో కూడిన ఈ వీడియోలో హీరోయిన్ నిత్యామీనన్ అభిమానుల గుండెల్లో ఓ బాంబు పేల్చింది. ఈ సినిమా ట్రైలర్ లో కధ మొత్తం చెప్పి, వీక్షకులను మానసికంగా ప్రిపేర్ చేసిన కొరటాల శివ అసలు కధ వేదే ఉందని, ఫుల్ స్టోరీ ట్రైలర్ లో చూపించింది కాదని, ఈ సినిమాకు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉందని చెప్పుకొచ్చింది నిత్యా. ఇలాంటి విశేషాలు, ట్విస్ట్ లతో కూడిన వీడియో వీక్షకుల కోసం…