nandamuri hari krishna2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ మామ ఆధ్వర్యంలో నడిచిన మీడియా ఛానల్ లో జగన్ కు అనుకూలంగా ప్రచారం మొదలు పెట్టడంతో పుట్టిన ఈ ప్రశ్న ఎప్పుడూ ఏదొక సమయంలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. తాజాగా ఓ ప్రముఖ జర్నలిస్ట్ తన బ్లాగ్ లో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో గత రెండు, మూడు రోజుల నుండి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తొలుత ‘లైట్’ తీసుకున్న ఈ విషయానికి సోషల్ మీడియా మరియు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ప్రచారం లభించడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

మరి నిజంగానే నందమూరి హరికృష్ణ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి జంప్ అవుతారా? ఒకవేళ పార్టీ మారితే హరికృష్ణకు ఎలాంటి వైభవం లభిస్తుందనేది ప్రధాన అంశం కాదు. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ సినీ భవిష్యత్తు ఏ మలుపు తీసుకుంటుంది? అలాగే గతంలో తెలుగుదేశం పార్టీపై తారక్ చేసిన కీలక వ్యాఖ్యలకు జవాబెంటి? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం కావాలంటే మరికొంత సమయం పడుతుందేమో! అయితే వర్తమాన పరిస్థితులను విశ్లేషించుకుంటే మాత్రం…

“నాన్నకు ప్రేమతో” సినిమా విడుదల సమయంలో టిడిపి అవలభించిన వైఖరితో ఆగ్రహం చెందిన హరికృష్ణ, రాయలసీమలో ఈ సినిమాకు జగన్ సహకారం తీసుకుని విడుదల చేసారని, అప్పటినుండి జగన్ తో హరికృష్ణ టచ్ లో ఉంటున్నారని, ఎప్పుడైనా పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవచ్చనేది” ఆ ప్రముఖ జర్నలిస్ట్ వ్యక్తపరిచిన సారాంశం.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. చంద్రబాబుని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసిన తర్వాత కొడాలి నాని అంటే టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. అది తెలిసి కూడా “నాన్నకు ప్రేమతో” విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయడమేంటి అన్న మాటలు వినపడ్డాయి. దీంతో తాజాగా చెలరేగిన వార్తలకు ఈ మాటలు బ్యాక్ గ్రౌండ్ లో బలం చేకూర్చినట్లయ్యింది. గత రెండేళ్లుగా ఎన్నో మలుపులు తీసుకుంటున్న ఈ ప్రశ్నకు పర్మినెంట్ జవాబు ఎప్పుడు దొరుకుతుందోనని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు, అటు తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.