MEEKU-MERE-MAKU-MEME-TRAILER-TALKఇటీవల కాలంలో విడుదల అవుతున్న కొన్ని చిన్న సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ సత్తాను చాటుతుండగా, మరికొన్ని సినిమాలు మాత్రం ఉన్న ఆసక్తిని కూడా తగ్గిస్తున్నాయి. ఆ జాబితాలోనే తాజాగా ఆడియో విడుదల చేసుకున్న “మీకు మీరే మాకు మేమే” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆసక్తిని కలిగించలేకపోయింది.

నేటి యువతరం ప్రేమను వెండితెరపై ప్రతిబింబించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ కోవలోకే ఈ సినిమా కూడా చేరిపోతుందన్న సంకేతాలు ట్రైలర్ ఇస్తోంది. గీత ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను పంపిణి చేయడానికి నిర్ణయించుకోవడంతో పబ్లిసిటీ పరంగా డోకా లేకపోయినా… బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు నెట్టుకు వస్తుందో చూడాలి. సినిమా టైటిల్ కు తగ్గట్లే హీరోహీరోయిన్లు ట్రైలర్ లో కనిపిస్తుంటే… మరి ధియేటర్లో ఆడియెన్స్ కు ఎవరు అండగా నిలుస్తారో..? అన్న కౌంటర్లు నెటిజన్ల నుండి వస్తున్నాయి.