mahesh babu brahmostavam indian expressఒక ఆంగ్ల దినపత్రికలో మంగళవారం నాడు ప్రచురితం అయిన ‘బ్రహ్మోత్సవం’ కధనంపై సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ అభిమానులు దండెత్తడంతో… తదుపరి సంచికలో సదరు పత్రిక యాజమాన్యం వివరణతో కూడిన జవాబు ఇస్తుందని… సంప్రదింపులు జరిగిన తర్వాత ప్రిన్స్ అభిమానపు సంఘం నేతలు దిడ్డి రాంబాబు తదితరులు మీడియా వర్గీయులకు తెలిపారు. అయితే నేటి సంచిక వెలువడింది కానీ, సదరు పత్రిక నుండి ఆశించిన సమాధానం మాత్రం వెలువడలేదు.

‘జరిగింది పొరపాటు అని గానీ, ఇక ముందు అలాంటి కధనాలు ప్రచారం చేయము అని గానీ’ ఎలాంటి ప్రకటన లేకుండా సాగిన లేటెస్ట్ ఆర్టికల్ లో… మరింత విస్తుగోలిపే అంశం వెలుగు చూసింది. ఆన్ లైన్ లో ‘బ్రహ్మోత్సవం’పై జరుగుతున్న ప్రచారం వలన మహేష్ బాబు అభిమానులంతా ఏకం అయ్యారు అనే సరికొత్త విషయాన్ని ‘టైటిల్’గా పెట్టి మరీ కధనాన్ని రాసుకు రావడం సదరు పత్రిక తీరుతెన్నులకు అద్దం పడుతోంది. అలాగే, పత్రికా యాజమాన్యంతో సంప్రదింపులు ముగిసిన తర్వాత దిడ్డి రాంబాబు తదితరులు మీడియా వర్గీయులతో మాట్లాడిన మాటలను మాత్రమే ప్రచురించారు.

చూడబోతుంటే… మొదటి ‘ఆర్టికల్’ను మించిన ‘ఎటకారం’గా ఈ ‘వివరణ’ను ఇచ్చినట్లుగా కనపడుతోంది. ‘బ్రహ్మోత్సవం’పై ప్రచురించిన కధనానికి ఎక్కడా ‘పశ్చాత్తాపం’తో కూడిన మాటలు సదరు పత్రికలో లేకపోవడం అనేది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు గానీ, హీరోలను టార్గెట్ చేసుకుంటూ సాగుతున్న మీడియా వివక్ష మరోసారి స్పష్టంగా కనపడుతోందని ప్రిన్స్ అభిమానులు మండిపడుతున్నారు. దీనిని ‘వివరణ’ అని సంభోదించే కంటే కూడా ఒక ‘న్యూస్’ మాదిరి రాసుకోచ్చారని చెప్పడం సబబుగా ఉంటుంది. దీంతో ఇది కేవలం పొరపాటు వలన జరిగింది కాదని, ‘బ్రహ్మోత్సవం’ సినిమాను గానీ, ప్రిన్స్ మహేష్ బాబు ను కానీ ఉద్దేశ పూర్వకంగానే టార్గెట్ చేస్తూ రాసిన కధనంగా అభిమానులు చెప్పుకుంటున్నారు.