Kommineni, Kommineni Survey, Kommineni Srinivasa Rao Survey, Kommineni Anti TDP Survey, Kommineni TDP Survey, Kommineni Elections Surveyతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆ పార్టీ అంతర్గత సర్వేను నిర్వహించిందని, దాని ఫలితాలను విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్నానని.. తెలుగు మీడియాలో వివిధ రకాల చర్చల్లో పాల్గొని సుపరిచితుడైన ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా వస్తాయన్న విషయమై టీడీపీ ఓ సర్వే నిర్వహించగా, ఆ పార్టీకి చుక్కెదురయ్యే వాస్తవం వెల్లడైందని తెలిపారు.

ఎన్నికలు జరిగితే, తెలుగుదేశం పార్టీకి 51 స్థానాలకు మించి రావని సర్వేలో వెల్లడైనట్టు తనకు తెలిసిందన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అదే ఈ సర్వేలో ప్రతిబింబించిందని వెల్లడించారు. కొమ్మినేని శ్రీనివాస్ ఈ విషయాన్ని వెల్లడించగానే, పలు వెబ్ సైట్లు దీన్నే ప్రచురించాయి.

కాగా, తమ పార్టీ ఎలాంటి సర్వేను నిర్వహించలేదని, అసలు అలాంటి ఆదేశాలను తమ అధినేత ఇవ్వలేదని ఓ టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, 2014 ఎన్నికలకు ముందు వైకాపా 129 నుంచి 133 సీట్లు, టీడీపీ 42 నుంచి 46 సీట్లు గెలుస్తుందని ‘ఎన్టీవీ’ ఎడిటర్ గా కొమ్మినేని వెల్లడించగా, వాస్తవ ఫలితాలు ఈ సర్వేకు ఎంతో దూరంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో తాజా సర్వే పట్ల కొమ్మినేని “హాస్యం… హాస్యం…” పండిస్తున్నారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.