kalyan-ram-puri-interesting-combination-again-temperదర్శకుడు పూరీ జగన్నాధ్ హీరోయిజాన్ని ఏ స్థాయిలో చూపిస్తారో సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. మరి అలాంటి పూరీ తాజాగా “రోగ్” అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో జత కట్టబోతున్నాడని సమాచారం.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాను ఏప్రిల్, మే మాసాలలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందంటూ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పూరీ పీక్ లెవల్ హీరోయిజం కళ్యాణ్ రామ్ కు ఏ మేరకు సెట్ అవుతుందన్న సందేహాలు సర్వత్రా వినపడుతున్నాయి.

గత ఏడాదిలో కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కు ‘టెంపర్’ వంటి సినిమాను ఇచ్చి జూనియర్ కెరీర్ కు మంచి ఊపు తెచ్చిన పూరీ జగన్నాధ్… ‘షేర్’ చిత్రంతో డీలాపడ్డ కళ్యాణ్ రామ్ కు కూడా మరో ‘టెంపర్’ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.