Jai Balaih tatoo feverనాని నటించిన “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమాకు బాలయ్య అభిమానుల మద్ధతు ఏ విధంగా ఉందో అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పడుతుండగా, మరో వైపు బాలయ్య అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు. ఈ సందర్భంగా ‘జై బాలయ్య’ టాట్టూలతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు.

ఈ సినిమాలో ఒక్క బాలయ్య గురించే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా డైలాగ్స్ ఉన్నాయని సమాచారం. వీరిద్దరి పేర్లు రాగానే ధియేటర్లలో ప్రేక్షకుల హడావుడి తెలుసుకోవాలంటే… ఓ మాంచి మాస్ ధియేటర్ కు వెళ్ళాల్సిందే. ఇక, ఈ సినిమా ద్వారా నాని “నాచురల్ స్టార్”గా అవతరించాడు. దీనికి సంబంధించిన ధియేటర్ పిక్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి. లోకల్ టాక్ తో పాటు ఓవర్సీస్ లో కూడా “కృష్ణగాడి వీరప్రేమగాధ”కు మంచి టాక్ రావడంతో నాని ఇమేజ్ మరింత రెట్టింపయ్యిందన్న టాక్ కూడా ప్రచారంలో ఉంది.