its-time-for-alluarjun-to-prove-as-a-good-singerప్రస్తుత తరం కధానాయకులు ఒక్క హీరో పాత్రలకే పరిమితం కాకుండా వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే దర్శకత్వం, పాటలు పాటడం, ఫైట్లు కొరియోగ్రఫీ చేయడం వంటి వివిధ విభాగాల్లో తనకున్న టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోలు గానంలో తమ సత్తాను ఆడియన్స్ కు చూపించారు.

తాజాగా అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఇప్పటివరకు హీరో వేషాలు మాత్రమే వేసిన బన్నీ తొలిసారిగా తనలోని సింగింగ్ టాలెంట్ ను “సరైనోడు” చిత్రం ద్వారా పరీక్షించుకోబోతున్నాడు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అల్లు వారబ్బాయి తొలిసారిగా ఓ పాట పాడబోతున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

సంగీత దర్శకుడు తమన్ తో పాటు బన్నీ ఉన్న ఫోటోలు అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. అభిమానుల సంఖ్యలో ఇప్పటికే కోటి మార్క్ దాటిన అల్లు అర్జున్ ఫోటోలు ఈ రేంజ్ లో హల్చల్ చేయడం ఊహించదగ్గ అంశమే.