Director-Sukumar-Interview-video-1lakh viewsదర్శకుడు సుకుమార్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. ఆయన దర్శకత్వం వహించిన గత రెండు సినిమాలు చూస్తే, సుకుమార్ ప్రతిభపై ప్రశ్నలు తలెత్తవు. అలాంటి సుకుమార్ మనోభావాలు తెలుసుకోవాలని ఊవ్విళ్ళూరడం ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కలుగడం సహజమే. అందులో భాగంగానే ఇటీవల ఓ వెబ్ మీడియా ప్రతినిధికి సుకుమార్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

“నాన్నకు ప్రేమతో” సినిమా సంగతులతో సాగిన ఈ ఇంటర్వ్యూను ఇప్పటికే ఒక లక్ష మందికి పైగా వీక్షించడం విశేషం. అతి తక్కువ సమయంలో ఓ ఇంటర్వ్యూ వీక్షకుల సంఖ్య లక్ష దాటడం ఇదేనని సదరు మీడియా ప్రతినిధి ట్విట్టర్ లో తన అనుభూతులను పంచుకున్నారు. ప్రచారం కోసమని ఇవాళ, రేపు దినపత్రికలకు, న్యూస్ చానల్స్ కు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇస్తూ సినీ పబ్లిసిటీలు నిర్వహిస్తున్న తరుణంలో… ఓ వెబ్ మీడియా ముఖాముఖీ కార్యక్రమం ఈ స్థాయిలో ఆదరణ పొందడం విశేషమే.