Dil Raju Allu Arjun DJ Duvvada Jagannadham, Dil Raju Harish Shankar Allu Arjun DJ Duvvada Jagannadham, Dil Raju Allu Arjun DJ Duvvada Jagannadham Shooting‘రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు’ సినిమా సక్సెస్ లతో మాంచి ఊపు మీదున్న అల్లు అర్జున్, తన కొత్త చిత్రాన్ని ఇప్పటివరకు మొదలుపెట్టలేదు. గత అయిదారు మాసాలుగా ఖాళీగా ఉన్న బన్నీ సినిమా ప్రకటన కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో మెగా అభిమానులకు కావల్సినంత వినోదాన్ని ప్రత్యక్షంగా అందించారనుకోండి… అది వేరే విషయం..! ఇక, సినిమా విషయానికి వస్తే… తాజాగా దిల్ రాజు చేసిన ప్రకటనతో బన్నీ తదుపరి సినిమాపై స్పష్టత వచ్చేసింది.

‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నిర్మించబోయే సినిమా “DJ దువ్వాడ జగన్నాధం” పూజాకార్యక్రమాలు సోమవారం నాడు జరగనున్నాయి. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ఎకౌంటు నుండి దిల్ రాజు ఒక ట్వీట్ చేసారు. దీంతో స్టైలిష్ స్టార్ సినిమాపై ఒక స్పష్టత వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ అందించిన హరీష్ శంకర్, మరో మెగా హీరో సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ్ కు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను అందించి, మెగా హిట్లను కొనసాగించాడు.

దీంతో ఈ మెగా హీరోకు ఎలాంటి సక్సెస్ ను అందిస్తాడో అంటూ అభిమానులలో చర్చలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే దిల్ రాజు – హరీష్ శంకర్ ల కాంభినేషన్లో ఇప్పటికే ‘రామయ్యా… వస్తావయ్యా…’ విడుదలై భారీ డిజాస్టర్ ను చవిచూసిన సంగతి తెలిసిందే. బహుశా ఆ నష్టాలను భర్తీ చేసేటంత భారీ హిట్ ను దిల్ రాజుకు కానుకగా ఈ ‘షాక్’ దర్శకుడు అందిస్తాడేమో చూడాలి.